ఏనుగుకు కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుందా.. పాపం అడ‌విదున్న‌

అడ‌వి జంతువులు కోపం తెచ్చుకుంటే అంతే సంగ‌తి.వాటి కోపానికి ఎదుటి ప్రాణం అయినా బ‌ల‌వుతుంది లేదంటే వాటి ప్రాణం అయినా వ‌దులుకుంటాయి.

 Would It Be The Same If The Elephant Was Angered Over Forest Buffalo, Elephant,-TeluguStop.com

మ‌రి అంత‌లా వాటి ప‌ట్టింపులు ఉంటాయి.అడ‌విలోనే అతిపెద్ద జంతువుగా ఉన్న ఏనుగుకు కోపంవ‌స్తే ఇంకేమైనా ఉందా చెప్పండి.

ప్రాణాలు గాల్లో క‌ల‌వాల్సిందే.భారీ ఆకారంతో పాటుగా ఏనుగుకు అన్నింటికంటే కూడా ఎక్కువ‌గా శక్తి సామర్ధ్యాలు ఉంటాయి.

అందుకే దాని కోపానికి ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే.ఇప్ప‌టికే మ‌నం ఎన్నో వీడియోల్లో ఏనుగు కోపానికి జ‌రిగిన విధ్వంసం చూశాం.

ఏనుగు జోలికి వెళ్తే అడవికి రాజైన సింహం అయినా భ‌య‌ప‌డాల్సిందే మ‌రి.అయితే చాలాసార్లు ఏనుగులు కూడా మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని చెబుతంటారు.కానీ ఇప్పుడు మీరు చూడ‌బోయే వీడియోలో ఏనుగు ఎంత‌టి భ‌యంక‌ర‌మైన‌దో అర్థం అవుతుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ అడవి దున్న ఏనుగు కోపానికి ఏకంగా ప్రాణాలు వ‌ద‌ల‌డం కూడా మ‌నం చూడొచ్చు.దీన్ని చూసిన వారంతా కూడా అస‌లు ఏనుగుకు జాలి అనేది ఉందా అని అనిపించ‌క మాన‌దు.

ఇందులో ఓ అడ‌వి దున్న ఓ చోట హాయిగా సేద తీరుతూ ఉంటుంది.అయితే అక్క‌డ‌కు అనుకోకుండా ఓ మగ ఏనుగు ఎంట్రీ ఇస్తుంది.ఇక ఆ ఏనుగు వ‌స్తూనే మెరుపు దాడి చేయ‌డం కూడా చూడొచ్చు.అడవి దున్నను ఏనుగు ఎంతో కోపంగా త‌న తొండంతో విసిరేసి తీవ్రంగా కుమ్మేస్తుంది.అత్యంత భ‌యంక‌రంగా దాని మీద దాడి చేయ‌డం క‌నిపిస్తుంది.గజరాజుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది.

చివ‌ర‌కు ఆ అడవి దున్న ఏనుగు కోపానికి ప్రాణాలు వదులడం బాధాక‌రం.ఈ సాడ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube