ఇత‌ని క్రియేటివిటీ చూస్తే ఇంజినీర్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతారేమో..

ఒక్క ఆలోచ‌న ఎన్నో ప‌నుల‌కు బీజం పోస్తుంది.ఒక్క ఆలోచ‌న జీవిత గ‌మ్యాన్ని మార్చేస్తుంది.

 Would Engineers Be Surprised To See His Creativity?, Creativity, Bike As Bycycle-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే జీవితాన్నే మ‌లుపు తిప్పుతుంది.కొంద‌రు చేసే ఆవిష్క‌ర‌ణ‌లు నిజంగా పెద్ద పెద్ద ఇంజినీర్లకు త‌ట్ట‌వేమో అనిపిస్తుంది.

చూడ‌టానికి వారు సామాన్య జ‌నాల్లాగే గ్రామాల్లో ఉన్నా కూడా వారి ఆలోచ‌న ప‌ర్వం అనిత‌ర సాధ్యం.వారు పెద్ద‌గా ఏమీ చ‌ద‌వ‌క‌పోయినా ఎలాంటి శిక్ష‌ణ తీసుకోక‌పోయినా స‌రే ఇంజినీర్ల కంటే తామేమీ త‌క్కువ కాద‌న్న‌ట్టు క్రియేటివిటీని బ‌య‌ట పెట్టేస్తారు.

అలాంటి వారికి సంబంధించిన వార్త‌లు నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వార్త‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

సాధార‌ణంగా దీన్ని చూస్తే మాత్రం ఇప్పుడు దేశంలో పెట్రోల్ ధరలు విప‌రీతంగా పెరుగుతున్నాయి కాబ‌ట్టి ఇలాంటి ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తాయ‌ని అనిపిస్తుంది.ఈ వీడియోలో ఓ వ్య‌క్తి ఏకంగా బైకునే సైకిల్ గా మార్చేశాడు.

చాలామంది సైకిళ్ల‌ను బైకులుగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే ఈయ‌న మాత్రం కొంచెం డిఫ‌రెంట్ గా ఆలోచిచించి తన బైక్‌కు సైకిల్ లా క‌నిపించేలా మార్చేశాడు.ఇది చూస్తే అతడి క్రియేటివిటీకి ఇంజనీర్లు కూడా షాక్ అయిపోతారేమో అన్న రేంజ్‌లో ఉంది.

కింద చూసేంద‌కు సైకిల్ టైర్ల‌ను అమ‌ర్చాడు.పైకేమో బైక్ సీటు, హ్యాండిల్ ఉన్నాయి.అంటే సీటుపై ఎంచ‌క్కా కూర్చుని వెళ్లొచ్చ‌న్న‌మాట‌.పైకేమో బైక్‌, కింద చూస్తే మాత్రం సైకిల్ అన్న‌ట్టుగా దాన్ని అమ‌ర్చాడు ఆయ‌న‌.ఇక దాన్ని ఎంచ‌క్కా రోడ్డుపై నడుపుకుంటూ వెళ్తున్నాడు.ఇంకేముంది దాన్ని నెట్టింట షేర్ చేయ‌గా అది కాస్తా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Paramount_Cycle_Store అనే ఐడీ ద్వారా దాన్ని షేర్ చేశారు.దాన్ని చూసిన వారంతా కూడా అత‌ని క్రియేటివికీ తెగ ఫిదా అయిపోతున్నారు.

సైంటిస్టులా ఉన్నాడంటూ మెచ్చుకుంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube