ఈ విచిత్ర‌మైన డ్రైవింగ్ నిబంధ‌న‌ల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత‌ డ్రైవింగ్ నియమాలు ఉన్నాయి.ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఈ నియమాలు రూపొందించారు.

 Would Be Surprised To Know About These Weird Driving Rules , Russia, Cyprus, Ala-TeluguStop.com

డ్రైవర్లు ఈ నిబంధనలను పాటించాలి.భారతదేశంలో చాలా సులభమైన డ్రైవింగ్ నియమాలు ఉన్నప్పటికీ, చాలా మంది వాటిని పాటించరు.

విదేశాలలో డ్రైవింగ్ నిబంధనలపై అందరూ చాలా సీరియస్‌గా తీసుకుంటారు.ప్రపంచంలోని చాలా దేశాల్లో విచిత్రమైన డ్రైవింగ్ నియమాలు ఉన్నాయి, ఈ నిబంధనలను పాటించకపోతే జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు.

వివిధ దేశాల్లోని వింత డ్రైవింగ్ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రష్యారష్యాలో మురికిగా ఉన్న‌ వాహనాలను నడపడాన్ని నిషేధించారు.

రష్యాలో నిర్లక్ష్యంగా కారు నడిపినా లేదా కారు మురికిగా ఉన్నా కారు య‌జ‌మాని జరిమానా చెల్లించవలసి ఉంటుంది.రష్యాలో మీ కారును శుభ్రంగా ఉంచుకోవడం య‌జ‌మాని బాధ్యత.
సైప్రస్ఈ దేశంలో మీరు మీ కారులో ఏమీ తినలేరు లేదా తాగలేరు.ఇక్కడ కారులో నీళ్లు తాగడం కూడా నేరమే.కారులో తిని, తాగుతూ పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అలాస్కాఅలాస్కా యూఎస్‌లోని ఒక రాష్ట్రం.

అలాస్కాలో ప్రజలు తమ కారులో కుక్కను పెట్టుకుని డ్రైవ్ చేయకూడ‌దు.
థాయిలాండ్థాయ్‌లాండ్‌లో వాతావరణం ఎలా ఉన్నా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా చొక్కా ధరించాలి.

టాప్‌లెస్‌గా వాహనం నడపడం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.ఇలా చేసేవారు భారీ జరిమానా చెల్లించాల్సి వ‌స్తుంది.
మనీలాఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో కారు ప్లేట్ నంబర్ ఒకటి లేదా రెండుతో ముగిస్తే.సోమవారాల్లో డ్రైవ్ చేయకూడ‌దు.
సౌదీ అరబ్సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయకూడ‌దు.అక్కడ మహిళ కారు నడ‌ప‌డం నేరం.

అక్క‌డ మహిళ కారు నడిపితే ఆమెను అరెస్టు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube