ఈ ఊరి ప్రజలకు ఉన్న ప్రత్యేక టాలెంట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

భూమికి పది అడుగుల ఎత్తులో గాల్లో తేలుతున్న తాడుపై నడవమంటే మీరు నడవగలరా? అది చాలా కష్టం కదూ.కానీ రష్యాలోని త్సోవ్క్రా -1 అనే ఊరిలో నివసిస్తున్న ప్రజలందరూ చాలా సులభంగా తాడుపై నడిచేస్తున్నారు.

 Would Be Surprised To Know About The Special Talent That The People Of This Vill-TeluguStop.com

చిన్న పిల్లల మంచి వయసు పైబడిన వారందరూ తాడుపై నడవగల తమ ప్రతిభను చూపిస్తూ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.నిజానికి ఆ ఊరిలో రోడ్డు సదుపాయాలు ఉన్నాయి.

అయినప్పటికీ వారందరూ తాడుపై నడుస్తున్నారు.ఎందుకని అడిగితే అది తమ గ్రామస్తుల ప్రత్యేక టాలెంట్ అని చెబుతున్నారు.

టైట్ రోప్ మీద నడిచే టాలెంట్ తమ గ్రామస్తుల సొంతమని సగర్వంగా తెలుపుతున్నారు.గత కొన్ని దశాబ్దాలుగా తాళ్లపైనే నడుస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

రష్యాలోని డాగేస్టాన్ అటానమస్ రిపబ్లిక్ పర్వతాల్లోని ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం 400 మంది నివసిస్తున్నారు.ఈ గ్రామ ప్రజలు దాదాపు వందేళ్ల క్రితమే తాడు మీద నడవటంలో నైపుణ్యం సాధించారు.

ఆడవారు కూడా తాడులపై నడవడం ప్రారంభించి మగవారికి పోటాపోటీగా సర్కస్‌లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.నిజానికి ఈ గ్రామ ప్రజలు మొదట్లో సర్కస్‌ సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం తాడుపై నడవడం ప్రారంభించారు.

కానీ అది క్రమేపీ ఒక సాంప్రదాయంగా మారిపోవడంతో ప్రతి ఒక్కరూ తాడుపై నడవడం నేర్చుకున్నారు.అప్పట్లో మూడు వేల మంది ప్రజలు ఈ గ్రామంలో నివసించే వారు.

పుట్టిన సమయాన్ని విషయం వారికి తాడుపై నడవడం అలవాటు చేసేవారు.ఆ విధంగా సాధన చేస్తే ఏదైనా.

ఎవరికైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు.

Telugu Latest, Rope-Latest News - Telugu

ఈ ఊరి ప్రజలు తాడు మీద నడవడానికి మరొక కారణం ఉంది.త్సోవ్క్రా -1 గ్రామం పర్వతాల మధ్య ఉంటుంది.అప్పట్లో సరైన రోడ్డు సదుపాయాలు లేక ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకు చేరుకోవాలంటే తాళ్లపై నడవటం నేర్చుకున్నారు పూర్వీకులు.

ఆ విధంగా అప్పటి కాలం నుంచే తాళ్లను ఆధారంగా చేసుకుని నడవడం ప్రారంభించారు.కాలం గడుస్తున్న కొద్దీ ఇది వాళ్లకి ఒక అలవాటుగా మారిపోయింది.అలాగే ఈ ప్రతిభే వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది.అయితే కొందరు మాత్రం చదువుపై పెద్ద పెట్టాల్సిన అవసరం ఉండదని లేదంటే గ్రామం ప్రజల భవిష్యత్తు గాడాంధకారంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube