జెమిని తలరాత మార్చలేకపోతున్న తారక్

ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ అంటే టాప్ లో వచ్చేవి స్టార్ మా.జీ తెలుగు.

 Worst Trp Ratings For Tarak Show Evaru Meelo Koteeswarulu-TeluguStop.com

ఈటీవీ.వీటి తర్వాత స్థానంలో జెమిని ఉంటుంది.

మిగతా ఛానెల్స్ దాటికి తట్టుకోలేక నాలుగు లేదా ఐదవ స్థానంలో కొట్టుమిట్టాడుతుంది జెమిని ఛానెల్ ని ఎలాగైనా మొదటి లేదంటే రెండవ స్థానానికి తేవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.ఏకంగా తారక్ ని రంగంలోకి దింపి ఎవరు మీలో కోటీశ్వరులు షో తిరిగి స్టార్ట్ చేసారు.

 Worst Trp Ratings For Tarak Show Evaru Meelo Koteeswarulu-జెమిని తలరాత మార్చలేకపోతున్న తారక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తారక్ రావడం తో జెమిని ఛానెల్ కి పూర్వ వైభవం వస్తుంది గంపెడు ఆశలు పెట్టుకుంది.టిఆర్పి రేటింగ్స్ పెరుగుతాయని కూడా అనుకుంది.

కాని అలంటి పరిస్థితులు అసలు కనిపించడం లేదు.తారక్ మరియు తమన్నా లతో సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరులు మరియు మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసారు.

ఈ రెండు షోలు ప్రారంభం అయ్యి ఇప్పటికే మూడు వారాలు గడిచాయి.అయినా కూడా జెమిని టీవీ ర్యాంకింగ్ లో ఎలాంటి చేంజ్ కనిపించడం లేదు.కనీసం నాలుగో స్థానంలో ఉన్న ఈటీవి ని సైతం దాటలేకపోతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే అంటున్నారు మరికొందరు.

మరి కొన్ని వారల దాటితే సదరు షోస్ యొక్క రేటింగ్స్ పెరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు.ఒక వైపు సీరియల్స్ తో జీ తెలుగు దూసుకుపోతుంటే, మరో వైపు బిగ్ బాస్ వంటి షోస్ తో స్టార్ మా వాటి స్థానాలను పదిలంగానే కాపాడుకుంటున్నాయి.

ఇక ఈటీవీ కి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఊపిరి పోస్తున్నాయి.అందుకే ఈ మూడు ఛానెల్స్ మొదటి మూడు స్థానాల్లో అలాగే కొనసాగుతున్నాయి.

Telugu Bigg Boss, Emk Ratings, Entertainment Channels, Etv, Evaru Meelo Koteeshwarulu, Gemini Tv, Gemini Tv Fourth Place, Host Ntr, Master Chef, Ntr, Ntr Emk Show Ratings, Star Maa, Tamanna, Tarak, Tollywood, Zee Telugu-Movie

ఇక నాలుగో స్థానం నుంచి జెమిని ఇప్పట్లో కదిలే సీన్ లేదంటున్నారు కొందరు.తారక్ షో వెనక పాడటానికి కారణాలు లేకపోలేదు.ఎవరు మీలో కోటీశ్వరులు షో వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే వస్తుంది.పైగా ఈ షో ప్రసారం అయ్యే సమయంలో మరే షో లేకపోవడం తో ఈ షో మిగతా షోస్ ని క్రాస్ చేయలేపోతుంది.

అందుకే మిగతా ఛానెల్స్ రేటింగ్ పదిలంగా ఉండగా, దేనికి సైతం వ్యూయర్షిప్ లేదు.

#Gemini TV #Bigg Boss #Tarak #EvaruMeelo #Emk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు