కారు డ్రైవింగ్ రాకపోతే ఎవరైనా ఏం చేస్తారు.కష్ట పడి నేర్చుకుంటారు.
అంతేగా.కానీ కారు డ్రైవింగ్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు.
పార్కింగ్ చేయడం కూడా నేర్చుకోవాలని ఈ వీడియో చుస్తే ఎవ్వరికైనా యిట్టె అర్ధం అవుతుంది.చాలా మంది డ్రైవింగ్ మీద పెట్టే ద్రుష్టి పార్కింగ్ ఎలా చేయాలి అనే నేర్చుకోవడం మీద పెట్టరు.
కానీ పార్కింగ్ చేయడం ఇంత కష్టమా అని ఈ వీడియో చుస్తే మీరు కూడా అంటారు.
తాజాగా ఒక వ్యక్తి కారు పార్కింగ్ చేయడం కోసం పడే పాట్లు నెటిజెన్స్ కు నవ్వు తెప్పిస్తున్నాయి.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.అతడు కారును పార్కింగ్ చేసే విధానం చేసి నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కోలాగా కామ్నెట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలుపు తున్నారు.
మీరు కూడా ఈ వీడియోలో ఏమి ఉందొ తెలుసుకోవాలని అనుకుంటున్నారా.
అసలు ఏం జరిగిందంటే.
యుకె లో నివసిస్తున్న ఆండ్రాయ్ డాల్కా అనే వ్యక్తి తన బాల్కనీలో కూర్చుని మొబైల్ చూస్తూ ఉన్నాడు.
అదే టైం లో తన అపార్ట్మెంట్ కు ఎదురుగ ఉన్న పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి కార్ పార్కింగ్ చేయడానికి పడే అవస్థలను చూసి ఆండ్రాయ్ తన మొబైల్ ఫోన్ లో ఈ దృశ్యాలను రికార్డ్ చేసాడు.తర్వాత దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో బయటకు వచ్చింది.
కింద పార్కింగ్ ఏరియాలో అతడు కార్ పార్క్ చేయడానికి చాలాసేపు అవస్థ పడ్డాడు.అంత సేపు కష్టపడ్డాడంటే ఎదో ఇరుకుగా ఉందేమో అనుకుంటున్నారా.అలా ఏమి కాదు రెండు కార్లు పట్టేంత కాళీ స్థలం ఉన్న అతడు కార్ పార్కింగ్ చేయడానికి దాదాపు 8 నిముషాలు కష్టపడ్డాడు.
అంత సేపు కష్టపడ్డాక గాని అతడికి పార్కింగ్ చేయడం పూర్తి కాలేదు.ఈ వీడియో సోషల్ మీడియాల్లో నిముషాల్లో వైరల్ అయ్యింది.మీరు కూడా ఒక లుక్ వేయండి.