తెల్ల అన్నంతో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవతలను పూజించి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.ఈ క్రమంలోనే భక్తులు ఎన్నో రకాల నైవేద్యాలను తయారుచేసే దేవుడికి సమర్పిస్తుంటారు.

 Worship With White Rice For Wealth And Happiness In Home,  White Rice, Wealth Ha-TeluguStop.com

అయితే తెల్ల అన్నాన్ని వివిధ రకాల నైవేద్యంగా తయారుచేసి దేవుళ్లకు సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

తెల్ల అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి పశువులకు పెట్టడం వల్ల మన ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు.

అలాగే తెల్ల అన్నంలోకి తేనెను కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యం సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.తెల్ల అన్నంలోకి శనగపప్పు వేసి పాయసం చేసి కుల దైవానికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇంట్లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా, మనశ్శాంతితో సంతోషంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.

అలాగే శని ప్రభావ దోషమున్నవారు తెల్ల అన్నానికి నువ్వులు కలిపి శనీశ్వరునికి నైవేద్యంగా సమర్పించాలి.

Telugu Crows, Devotional, Problems, Honey, Lard, Shani Dosam, Shiva Lingam, Telu

అదేవిధంగా కాకులకు పిండప్రదానం చేయడం వల్ల శని ప్రభావం దోషాలు తొలగిపోవడమే కాకుండా పితృ శాపాలు కూడా తొలగిపోతాయి.ఇకపోతే తెల్ల అన్నంతో శివలింగాన్ని తయారుచేసి పూజించిన తర్వాత అన్నంతో తయారు చేసిన శివలింగాన్ని నదిలో వదిలి రావడం వల్ల మన ఇంట్లో సంపదకు ఏలోటు ఉండదు.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ఇలా దేవతలకు నైవేద్యం సమర్పించడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube