చ‌ర్చిలో వినాయ‌కుడికి పూజ‌లు.. ఎక్క‌డంటే..?

గణనాథుడిని మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ పూజిస్తారు.ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న భారతీయులున్నారు.

 Worship Of Ganesha In The Church In Spain, Ganesha, Viral News, Spain, Ganehsa A-TeluguStop.com

ఈ క్రమంలోనే వారు భారత కాలమానం ప్రకారం పండుగలను అక్కడ కూడా జరుపుకుంటారు.తాజాగా గణేశ్ విగ్రహాన్ని కొంతమంది హిందువులు ఊరేగింపుగా తీసుకుని వెళ్తుండగా, అది చూసిన కొంతమంది స్థానికులు గణనాథుడిని చర్చిలోకి తీసుకురావాలని కోరారు.

దాంతో విఘ్నేశ్వరుడు చర్చిలోకి వెళ్లాడు.అక్కడ పూజలందుకున్నాడు.

ఈ అరుదైన ఘటన యురోపియన్ కంట్రీ స్పెయిన్‌లో జరిగింది.అలా చర్చిలో జీసస్, గణేశ్ ఇద్దరూ కలిసి ఉన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఈ వీడియోను ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, నెట్టింట అది వైరలవుతోంది.

ఇకపోతే మన దేశంలో అంతటా ప్రస్తుతం వినాయక చవితి పండుగ వాతావరణం నెలకొంది.గల్లీ నుంచి మొదలుకుని ఢిల్లీ వరకు ఊరూ, వాడాల్లో గణనాథుడిని ప్రతిష్టిస్తున్నారు.

ఈ సందర్భంగా సంబురాల్లో ప్రజలు పాల్గొంటున్నారు.అయితే, వినాయక చవితి పండుగ అంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల వారికి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చాలా ఇష్టమని పెద్దలు చెప్తున్నారు.

స్వాతంత్ర ఉద్యమ సమయంలో వినాయక చవితి పండుగలు నిర్వహిస్తామనే పేరు చెప్పి ప్రజల్లో స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను నాటి స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు రగిల్చారని పెద్దలు వివరిస్తున్నారు.ఇకపోతే స్పెయిన్‌లో జీసస్, గణేశ్ ఇద్దరూ ఒకే చోట కొలువు దీరి ఉండటం చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సదరు వీడియోను సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ చేస్తున్నారు.చర్చిలోపల ఉన్న వారు గణేశుడిని పూజించడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.‘భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక’గా గణేశుడిని చర్చిలో పూజించడం చాలా మంచి విషయమని కామెంట్స్ చేస్తున్నారు.‘జై బోలో గణేశ్ మహరాజ్, విఘ్నరాజా విఘ్నాలు రాకుండా కాపాడు’ అని పోస్టులు పెడుతున్నారు.

మొత్తంగా గణనాథుడికి కీర్తనలు షురూ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube