అనంతపురం జిల్లా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తినే అన్నంలో పురుగులు..

Worms In The Rice Eaten By Anantapur District Primary School Students

అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గడ్డం నాగేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తినే అన్నంలో పురుగులు బయటపడ్డాయి.ఆ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెరవలి రమేష్ అకస్మాత్తుగా మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆయనకు తెలిపారు.దీనిపై ఆయన ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా… అయితే ఆమె పొరపాటున వచ్చాయంటూ చెబుతూనే… తనకు ఎమ్మెల్యే సపోర్టు ఉందని, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

 Worms In The Rice Eaten By Anantapur District Primary School Students-TeluguStop.com

పాఠశాలలో మధ్యాహ్న భోజనం రోజు ఇలానే ఉంటుంది.మాకు ఎంపీడీవో, ఎమ్మెల్యే అందరూ అండగా ఉన్నారు.మాకు ఇలానే చేయమన్నారు.మీ ఇంట్లో పురుగులు రావట్లేదా, అవి తీసేసుకుని తింటున్నారు కదా.ఇవి కూడా అలాగే తీసేసుకుని తినండి మా ఇష్టం వచ్చినట్లు వండుతాము , తింటే తినండి లేకుంటే లేదు అని తెగేసి చెబుతున్నారు.మాకు మా ఎమ్మెల్యే అండగా ఉంది మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకో చూసుకుందాం అంటూ స్కూల్ కమిటీ చైర్మన్ పై వంటమనిషి విరుచుకుపడ్డారు.

 Worms In The Rice Eaten By Anantapur District Primary School Students-అనంతపురం జిల్లా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తినే అన్నంలో పురుగులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Eaten #Anantapur #Worms #Mla #Primary School

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube