చాక్లెట్‌లో పురుగులు.. రూ.50 లక్షల పరిహారం కోరిన బెంగళూరు వాసి

చాక్లెట్ బార్‌లో పురుగులు కనిపించడంతో ఒక వ్యక్తి రూ.50 లక్షలు పరిహారం కోరాడు.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.బెంగళూరులోని HSR లేఅవుట్ లో నివాసం ఉంటున్న ముకేష్ కుమార్ కేడియా 2016 అక్టోబర్‌లో… క్యా్డ్బరీ కంపెనీకి చెందిన ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్‌ ని రూ.89కి కొన్నాడు.దాన్ని తన మేన కోడలికి ఇచ్చాడు.

 Worms In Chocolate  Bangalore Resident Seeks Compensation Of Rs 50 Lakh , Chockl-TeluguStop.com

కొన్ని రోజుల తర్వాత ఆ చాక్లెట్‌లో పురుగులు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నాడు.అంత కాస్ట్‌లీ చాక్లెట్ కొంటే… పురుగులు ఉన్నది ఇస్తారా అనుకుంటూ… క్యాడ్బరీ కస్టమర్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి… విషయం చెప్పాడు.

వెంటనే ఆ కస్టమర్ హెల్ప్‌లైన్ వ్యక్తి… “ఆ పురుగులు ఉన్న చాక్లెట్ బార్‌ని మాకు పంపించండి” అని చెప్పగా… కేడియా… అది తన దగ్గర లేదన్నాడు.కనీసం ప్రూఫ్ కోసం ఫొటో అయినా ఇవ్వాలని కోరగా… అందుకు కూడా కేడియా ఒప్పుకోలేదు.

అయితే దానికి నిరాకరించిన అతడు దాని ఫొటోను వారికి పంపాడు.

తన ఫిర్యాదుపై క్యాడ్‌బరీ సంస్థ స్పందించకపోవడంతో 2016 అక్టోబర్‌ 26న బెంగళూరులోని అర్బన్‌ జిల్లా వినియోగదారుల కోర్టును ముఖేష్ కుమార్ ఆశ్రయించాడు.

క్యాడ్‌బరీ చాక్లెట్‌ల తయారీ సంస్థ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యతా విభాగం అధిపతితోపాటు కొనుగోలు చేసిన ఎంకే రిటైల్ బ్రాంచ్‌పై ‘సేవా లోపం’ కింద ఫిర్యాదు చేశాడు.రూ.89 విలువైన చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు పరిహారం కోరాడు.దీనిపై సంఘంలో వాదనలు జరిగాయి.రూ.89ల చాక్లెట్ కోసం ఏకంగా రూ.20 లక్షల దాకా పరిహారం అడగడం న్యాయం కాదని మోండెలెజ్ తరపు లాయర్ వాదించారు.అతను అడిగినంత పరిహారం ఇప్పించే అర్హతలు తమకు లేవన్న కోర్టు… రాష్ట్ర వినియోగదారుల కోర్టు కు వెళ్లాలని సూచించింది.

ఆరేళ్ల విచారణ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube