బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్‌ మీరెప్పుడైనా చూశారా? ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ ఇదే.!

కంప్యూటర్‌ బరువు.50 టన్నులు.ఆక్రమించిన స్థలం 1800 చదరపు అడుగులు.మొదట్లో కంప్యూటర్ అలాగే ఉండేది.ఇప్పుడు కాలం మారింది.నానో టెక్నాలజీ తరం వచ్చింది.

 Worlds Smallest Computer Is Here It Is Smaller Than A Rice Grain-TeluguStop.com

వేళ్ల సందుల్లో దాచిపెట్టగలిగే అతి చిన్న కంప్యూటర్‌ ఆవిష్కృతమైంది.బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్‌ మీరెప్పుడైనా చూశారా? అయితే అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్‌ను మీరు చూడాల్సిందేనట.

బియ్యపు గింజ కంటే చిన్నగా.0.3 మిల్లీమీటర్ల పొడవుతో.ఇంతకుముందు తయారు చేసిన ‘మిచిగాన్‌ మైక్రో మోట్‌(2x2x4)’ కంటే చిన్న పరిమాణంలో ఉంది.

ఈ కొత్త మైక్రో కంప్యూటర్‌లో ర్యామ్‌, ఫొటోవొల్టాయిక్స్‌, ప్రాసెసర్లు, వైర్‌లెస్‌ ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్లు ఉంటాయి.ఇందులో ఉండే చిన్న బల్బుతో డేటా బదిలీ జరుగుతుందని దీన్ని రూపొందించిన పరిశోధకుడు డేవిడ్‌ బ్రావూ తెలిపారు.

‘మేము అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని కంప్యూటర్‌ అని పిలుస్తారో? లేదో? కానీ, ఇది కంప్యూటర్‌ చేసే పనిని చేయగలదు’ అని ఆయన తెలిపారు.ఉష్ణోగ్రతను కచ్చితత్వంతో తెలిపే సెన్సర్‌లా దీన్ని రూపొందించామని వెల్లడించారు.

ఇది కణాల సమూహాల మధ్య ఉండే ఉష్ణోగ్రతను పసిగడుతుందని, దీన్ని ఆంకాలజీ రీసెర్చ్‌లో ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.కేన్సర్‌ కణాల వృద్ధి, కణితులు-ఆరోగ్యకర కణజాలం మధ్య ఉండే ఉష్ణోగ్రతను గుర్తించి, కేన్సర్‌ చికిత్స విజయవంతం అవుతుందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చని డేవిడ్‌ తెలిపారు.ఈ తాజా అధ్యయనాన్ని వీఎల్‌ఎస్ ఐ టెక్నాలజీ అండ్‌ సర్క్యూట్స్‌ -2018సదస్సులో ప్రదర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube