పుట్టగానే ఆ బిడ్ద సైజు యాపిల్ పండు అంతా! ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం  

యాపిల్ పండు బరువుతో పుట్టిన బిడ్డ. జపాన్ లో విచిత్రం. .

World\'s Smallest Baby Boy Goes Home From Japan Hospital-japan Hospital,world\\'s Smallest Baby Boy

ప్రపంచంలో కొన్ని కొన్ని అద్బుతాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రకృతిలో అలాంటి వింతలు చూసినపుడు కలికాలం వచ్చేసింది అనో, బ్రహ్మంగారు చెప్పింది నిజం అయ్యింది అనో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ వింత ఘటన జపాన్ లో చోటు చేసుకుంది..

పుట్టగానే ఆ బిడ్ద సైజు యాపిల్ పండు అంతా! ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం-World's Smallest Baby Boy Goes Home From Japan Hospital

జపాన్‌లో 2018 అక్టోబర్ 258 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టాడు. ఇది సుమారు ఓ యాపిల్ పండు బరువుకి సమానం. టోషిక అనే గర్భిణి అధిక రక్తపోటుతో బాదపడుతుండడంతో ఆమెకి 24 వారాల 5 రోజులకే అత్యవసరంగా సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా బిడ్డని బయటకి తీసారు.

ఆ సమయంలో 22 సెంటిమీటర్ల పొడవుతో బాబు పుట్టాడు. దీంతో శిశువుని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి సంరక్షించి 7 నెలల తర్వాత బయటికి తీసుకొచ్చారు. తక్కువ బరువుతో పుట్టిన బాబుకి తల్లిదండ్రులు సెకియా అని పేరు పెట్టారు. 7 నెలల చికిత్స అనంతరం 13 రెట్లు పెరిగిన బాబు ప్రస్తుతం 3 కిలోల బరువుకి వచ్చి ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బాబు ప్రపంచంలోనే అతి తక్కువ బరువు ఉన్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.