పుట్టగానే ఆ బిడ్ద సైజు యాపిల్ పండు అంతా! ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

ప్రపంచంలో కొన్ని కొన్ని అద్బుతాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.ప్రకృతిలో అలాంటి వింతలు చూసినపుడు కలికాలం వచ్చేసింది అనో, బ్రహ్మంగారు చెప్పింది నిజం అయ్యింది అనో మాట్లాడుకుంటూ ఉంటారు.

 Worlds Smallest Baby Boy Goes Home From Japan Hospital-TeluguStop.com

ఇప్పుడు అలాంటి ఓ వింత ఘటన జపాన్ లో చోటు చేసుకుంది.జపాన్‌లో 2018 అక్టోబర్ 258 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టాడు.

ఇది సుమారు ఓ యాపిల్ పండు బరువుకి సమానం.టోషిక అనే గర్భిణి అధిక రక్తపోటుతో బాదపడుతుండడంతో ఆమెకి 24 వారాల 5 రోజులకే అత్యవసరంగా సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా బిడ్డని బయటకి తీసారు.

ఆ సమయంలో 22 సెంటిమీటర్ల పొడవుతో బాబు పుట్టాడు.దీంతో శిశువుని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి సంరక్షించి 7 నెలల తర్వాత బయటికి తీసుకొచ్చారు.తక్కువ బరువుతో పుట్టిన బాబుకి తల్లిదండ్రులు సెకియా అని పేరు పెట్టారు.7 నెలల చికిత్స అనంతరం 13 రెట్లు పెరిగిన బాబు ప్రస్తుతం 3 కిలోల బరువుకి వచ్చి ఆరోగ్యంగా ఉన్నాడు.ఇప్పుడు ఈ బాబు ప్రపంచంలోనే అతి తక్కువ బరువు ఉన్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube