కోవిడ్ ఎఫెక్ట్ తో ఆర్ధిక వ్యవస్థ కుదేలు! 32 లక్షల కోట్ల సంపద ఆవిరి

చైనాని అతలాకుతలం చేస్తున్న కావిడి-16 వ్యాధితో ఇప్పటికే వేల మంది చనిపోయారు.రోజుకి పదుల నుంచి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

 Worlds Richest Lose 444 Billion After Hellish Week For Markets-TeluguStop.com

ఈ వ్యాధి అంతకంతకు చైనాని ఆనుకొని ఉన్న ఇతర దేశాలకి కూడా విస్తరిస్తుంది.ఈ వ్యాధి కారణంగా చైనా దారుణమైన ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోయింది.

ఇక దీనిని ప్రపంచ దేశాలు అన్ని మందు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్న ఇప్పటి వరకు దానికి సంబంధించి చిన్న వాక్సిన్ ని కూడా అందించలేకపోయారు.ఇక ఈ వ్యాధి తీవ్రతతో ప్రపంచ దేశాలు ఓ విధంగా చైనాని పూర్తిగా దూరం పెట్టాయి.

ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నిస్తున్న చైనాకి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.అయితే ఈ ఎఫెక్ట్ కేవలం చైనా ఆర్ధిక వ్యవస్థ మీదనే కాకుండా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది.

గత వారం మార్కెట్లు భారీగా పతనం కావడంతో, సాధారణ ఇన్వెస్టర్లకు మాత్రమే కాక కోటీశ్వరులకు సైతం కోట్ల రూపాయల సంపద పోయింది.ప్రపంచంలోని టాప్ 500 ధనికులకు మొత్తంగా కలిపి 32,04,570 కోట్ల సంపద పోయిందని వెల్లడైంది.

కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశాలున్నాయని అంచనాలొస్తున్నాయి.దీంతో 2008లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటి కంటే దారుణంగా మార్కెట్లు పడటం, అంతకంటే ఎక్కువగా బిలీనియర్ల సంపద కరిగిపోవడం జరిగింది.

ప్రపంచంలో టాప్ 3 ధనికులు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌‌‌‌గేట్స్, ఎల్‌‌‌‌వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్డ్‌‌‌‌లు భారీగా నష్టపోయారు.వీరికి మొత్తంగా కలిపి 3,000 కోట్ల డాలర్ల సంపద పోయింది.

టెస్లా ఇంక్ షేర్లు పడిపోవడంతో, ఎలన్ మస్క్‌‌‌‌ సంపద 9 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.అయితే కోవిడ్ ప్రభావం ఇండియా ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపించడం లేదని మాత్రం ఇక్కడ ఆర్ధిక వేత్తలు చెబుతున్న మాట.మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయంగా వస్తు ఉత్పత్తి, సంపద సృష్టిని మోడీ సర్కార్ చేపట్టడం వలన కోవిడ్ ఎఫెక్ట్ ఇండియాపై అంతగా లేదనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube