మూడు రోజుల క్రితం శ్రీలంకలో జరిగిన బాంబు దాడుల్లో దాదాపుగా 300 మంది చనిపోగా, 500 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు, 300 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు.ఈ బాంబు దాడుల్లో చనిపోయిన ప్రతి ఒక్కరిది ఏదో ఒక విషాద గాథ అయ్యి ఉంటుంది.
కాని డెన్మార్క్ కు చెందిన అత్యంత ధనవంతుడు అయిన ఆండర్స్ హోల్స్ జీవితంలో ఈ బాంబు దాడులు పెను విషాదంను నింపాయి.ఎక్కడో డెన్మార్క్ నుండి చనిపోయేందుకే ఇక్కడకు వచ్చినట్లుగా ఆయన ముగ్గురు పిల్లలు కూడా శ్రీలంకలో చనిపోవడం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆండర్స్ హోల్స్ లక్షల కోట్లకు అధినేత.ఆయనకు నలుగురు పిల్లలు.వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, తండ్రి వారసత్వంను అందిపుచ్చుకునేందుకు సిద్దం అవుతున్నారు.తాజాగా హాలీడేస్‌కు అని శ్రీలంకకు వెళ్లారు.
శ్రీలంకలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న వారు బస చేస్తున్న హోటల్‌లో ముస్కరులు బాంబు దాడులు నిర్వహించారు.వారు చేసిన దాడితో నలుగురు పిల్లల్లో ముగ్గురు మృతి చెందారు.
తన పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిన ఆండర్స్ హోల్స్ దుఖంలో మునిగి పోయాడు.

స్కాట్లాండ్‌లో ఉన్న భూ భాగం మొత్తంలో ఒక శాతం భూమి ఆండర్స్ హోల్స్ ఆధీనంలో ఉందంటే ఆయన ఏ స్థాయిలో బిలియనీర్ అనే విషయంను ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు.అంతటి బిలియనీర్ అయిన ఆండర్స్ తన పిల్లలు చనిపోవడంతో తీవ్ర దుఖంలో మునిగి పోయాడు.శ్రీలంకకు విహార యాత్రకు అంటూ వెళ్లిన నలుగురు పిల్లలో ముగ్గురు విగత జీవులుగా మారడంను ఆయన తట్టుకోలేక పోతున్నాడు.
ఇంకా ఇలాంటి దారుణమైన కన్నీటి గాథలు శ్రీలంక మృతుల బందువుల్లో మిలిచింది.ఎంత డబ్బు ఉంటే ఏం లాభం చావు వచ్చిన సమయంలో ఆపడం ఎవరి తరం కాదు, డబ్బుంటే చావును ముందు కనిపెట్టడం కూడా సాధ్యం కాదు.
డబ్బున్న వాడికి, అడుకునే వారికి చావు అనేది సమానం అని ఈ ఉదంతం ద్వారా మరోసారి వెళ్లడయ్యింది.