80వ వివాహ వార్షికోత్సవం చేసుకున్న గిన్నీస్ బుక్ వృద్ధ జంట

పెళ్ళంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతూ ఉంటారు.వివాహమనే బంధం ఇద్దరిని జీవితాంతం కలిసి ఉంచుతుంది.

 Worlds Oldest Couple Celebrates Their 80th Wedding Anniversary-TeluguStop.com

ఆ బంధానికి కట్టుబడి చాలా జంటలు కలిసి ఉంటాయి.ఒకప్పుడు అయితే పెళ్ళైన తర్వాత భర్త ఎలాంటి వాడైనా అతనితోనే జీవితం అనుకోని భారతీయ స్త్రీలు ఉండేవారు.

అయితే ఈ మధ్య కాలంలో వివాహబంధానికి నేటితరం పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.పెళ్లి చేసుకుంటే కలిసుండాలని రూల్ ఏమైనా ఉందా అంటూ వితండవాదం చేస్తున్నారు.

ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే కలిసి ఉంటాం, ఆలోచనలు కలవకపోతే కలిసి ఉండాల్సిన అవసరం లేదు అంటూ తమ వాదన వినిపిస్తున్నారు.అయితే ఒకప్పటి తరం భార్యాభర్తలు నిండు నూరేళ్ళు భార్యాభర్తల బంధంలో ఉండాలి అని పెద్దల దీవనకి తగ్గట్లుగా అమెరికాలో ఓ వృద్ధ జంట 80వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు.

అమెరికాలోని టెక్సాస్‌ కి చెందిన భర్త జాన్ హెడర్సన్ వయసు 106, భార్య ఛార్లెట్ వయసు 105.వీరికి వివాహం అయ్యి 80 ఏళ్ళు పూర్తయ్యింది.ఈ సందర్భంగా వారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ మధ్యనే అత్యంత వృద్ధ దంపతులుగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా వీరి వైవాహిక జీవితంలో మరో ఏడాదిలోకి అడుగుపెట్టారు.

ఎన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఇప్పటికి తమ మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం ఏ మాత్రం తగ్గలేదని వారు చెబుతున్నారు.ఎనిమిది దశాబ్దాలు దాటిన వారి వివాహ బంధానికి కుటుంబ సభ్యులు అందరూ అభినందనలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube