UK Lie Detector Test : ఇదెక్కడి అనుమానం, బాబోయ్.. భర్తకు రోజూ లై-డిటెక్టర్ టెస్ట్ పెడుతుందట..!!

కొంతమంది భార్యలు భర్త వేరొకరితో మోసం చేస్తున్నాడేమోనని బాగా అనుమానిస్తుంటారు.వైవాహిక బంధంలో వారు అనుక్షణం అసురక్షితంగా, అసూయగా ఫీల్ అయిపోతుంటారు.

 Worlds Most Jealous Woman Makes Husband Take Lie Detector Test Every Time He Re-TeluguStop.com

ఈ అనుమానాలతో భర్తలను బాగా వేధిస్తారు.తమ స్నేహితులను వదులుకోవడం లేదా తమ ప్రేమ( Love )ను నిరూపించుకోమని వారి టెస్టులు పెట్టడం చేస్తుంటారు.

ఇది కొంత వరకు సాధారణం, కానీ ఇది హానికరం కూడా కావచ్చు.అయితే ఇంతకుమించిన అనుమానంతో ఒక భార్య భర్తకు ఏకంగా లై-డిటెక్టర్ టెస్ట్( Lie Detector Test ) పెట్టడం స్టార్ట్ చేసింది.

అనుమానం పెనుభూతమైతే భార్యలు ఎందుకు తెగిస్తారు చెప్పడానికి ఈమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్‌కు చెందిన డెబ్బీ వుడ్ అనే మహిళను మీడియా “ప్రపంచంలోని అత్యంత అనుమానపడే మహిళ”గా అభివర్ణిస్తూ కథనాలను రాసేసింది.

ఆమె ఎల్లప్పుడూ తన భర్త స్టీవ్ ఫోన్, ఈ-మెయిల్, బ్యాంక్ అకౌంట్స్ కూడా తనిఖీ చేస్తుందట.ఇంటికి వచ్చిన ప్రతిసారీ లై డిటెక్టర్ టెస్ట్ కూడా పెడుతుందట.ఆమె లై డిటెక్టర్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసింది, అతనిని విశ్వసించే ఏకైక మార్గం అదేనని ఆమె భావించింది.డెబ్బీ( Debbi, ), స్టీవ్ 2011లో స్నేహితుడి ద్వారా ఫేస్‌బుక్‌( Facebook )లో కలుసుకున్నారు.

లండన్ బ్రిడ్జి కింద ప్రేమలో పడి ముద్దులు పెట్టుకున్నారు.స్టీవ్ తన ప్రేమను గెలుచుకున్నాడని డెబ్బి చెప్పింది.

అయితే వారు జంటగా మారకముందే స్టీవ్ మరొక మహిళతో డేటింగ్ చేశాడని తెలుసుకున్నప్పుడు డెబ్బి ఆందోళన చెందింది.అప్పుడు వారు సీరియస్‌గా లేరని స్టీవ్ చెప్పాడు, కానీ డెబ్బి అతని నిజాయితీని అనుమానించింది.

ఆ అనుమానం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పోలేదు.కలిసి జీవించడం వల్ల డెబ్బి మరింత అసూయ, అభద్రత భావన కలిగింది.

అతను ఆన్‌లైన్‌లో ఇతర మహిళలను చూడకుండా ఆపడానికి ఆమె అతని ల్యాప్‌టాప్‌లో ఫిల్టర్లను ఉంచింది.రోజూ అతనికి లై డిటెక్టర్ పరీక్ష కూడా పెడుతుంది.ఆమెకు ఒథెల్లో సిండ్రోమ్( Othello Syndrome ) అనే మానసిక రుగ్మత ఉంది.దీంతో స్టీవ్ తనను మోసం చేస్తున్నాడనే నమ్మకం కలిగింది.ఈ రుగ్మతకు షేక్స్పియర్ నాటకం పేరు పెట్టారు, ఇక్కడ ఒక వ్యక్తి తన భార్యను నమ్మకద్రోహంగా భావించి చంపేస్తాడు.ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు చాలా అసూయతో కొన్నిసార్లు హింసాత్మకంగా ఉంటారట.

డెబ్బీకి బైపోలార్ డిజార్డర్, బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ వంటి ఇతర మానసిక సమస్యలు కూడా ఉన్నాయి.ఆమె 2013లో మందులు తీసుకోవడం ప్రారంభించింది.

స్టీవ్ తనతో పాటు ఉండి తనకు మద్దతు ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పింది.

స్టీవ్ కూడా ఆమెను ప్రేమిస్తున్నానని, తాము ఆత్మీయులమని చెప్పాడు.ఆమె అనుమానం వల్ల తనకు అభ్యంతరం ఏం లేదని అతడు చెప్పి ఆశ్చర్యపరిచాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube