అతడి నాలుక విలువ అక్షరాలా రూ.92 కోట్లు.. ఎందుకంటే?

ఏంటి అతడి నాలుక విలువ రూ.92 కోట్లా అని ఆశ్చర్యపోతున్నారా.అక్కడికే వస్తున్న.‘కోస్టా కాఫీ’ ప్రపంచంలోనే బెస్ట్ కాఫీ బ్రాండ్లగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి బెస్ట్ కాఫీ అని పేరు తెచ్చుకోవడానికి కారణం ప్రముఖ చీఫ్ కాఫీ టేస్టర్‌ జెన్నరో పెల్లికియా అనే వ్యక్తే కారణమట.ఎందుకంటే అతడు రుచి చూసిన తర్వాతే ఏ కాఫీ ప్రొడక్టయినా మార్కెట్లోకి వెళ్తుందట.

 World, Expensive Tongue, Insured For 10 Million Pounds, Insurance, Coffee Taster-TeluguStop.com

అందుకే అతడు పనిచేస్తున్న సంస్ద రూ.92 కోట్లు విలువ కట్టింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.జెన్నరో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక కోస్టా కాఫీ కంపెనీలో చేరాడు.ఇంకా అక్కడ 18 ఏళ్లు పని చేశాక లండన్‌లోని లాంబెర్త్ రోస్టరీలో చేరాడు.అక్కడి నుంచే యూకే తదితర దేశాలకు 118 మిలియన్ కప్పుల కోస్టా కాఫీ సరఫరా అవుతుంది.

ప్రపంచంలోని హైక్లాస్ సెలబ్రిటీలు పర్‌ఫెక్ట్ కాఫీ కోసం రోస్టరీకి వెళ్తుంటారు .వారికీ స్వయంగా జెన్నరో కాఫీ గింజలను రుచి చూసి కాఫీని అందిస్తాడు.సెలబ్రెటీలకు ఇచ్చే కాఫీలో రుచి ఏ మాత్రం తగ్గినా అది వెనక్కి పంపుతాడు.మంచి కాఫీని అందిస్తాడు.రుచి విషయంలో అసలు రాజీ పడడు.సుమారు 25ఏళ్లుగా జన్నరో కాఫీని రుచి చూస్తూనే ఉన్నాడట.

అయినప్పటికీ అతనికి కాఫీ అంటే ఏ రోజు విరక్తి పుట్టలేదు.పైగా దానిపై మరింత ప్రేమ కలిగిందని అతడు చెప్తుంటాడు.ఇంకా అతడి సేవలు ఎంతో ముఖ్యం అని భావించిన రోస్టరీ అతడి నాలుకకు రూ.10 లక్షల పౌండ్లు అంటే 92 కోట్ల రూపాయిలు ఇన్సూరెన్స్ చేయించారు.జెన్నరో‌ను ఓ ”కాఫీ డిక్షనరీ” అని కాఫీ ప్రియులు అంటుంటారు.ఇది అంత చూస్తే మీకు అలానే అనిపిస్తుంది కదా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube