వామ్మో... ఆ గొర్రె ధర వింటే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే...!

గొర్రె కదా అని తేలిగ్గా తీసిపారేయద్దండి.దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం మీరు దీన్ని డైమండ్ గొర్రె అని పిలవాల్సి ఉంటుంది.

 World's Most Expensive Sheep Sells At Auction, Uk, Uk Sheep Becomes World's Most-TeluguStop.com

ఈ డైమండ్ గొర్రె ఖరీదు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.అవును.వేలంపాటలో రూ 3.5 కోట్లు పలికిందట ఈ గొర్రె.గురువారం స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో ఈ గొర్రె ఏకంగా £3,65,000 (3.5 కోట్లు) ధర పలికి అందరినీ ఆశ్చర్య పరిచింది.ఆ గొర్రె పేరు కూడా డబుల్ డైమండ్ కావడం కొసమెరుపు.
ఇక దీనితో ఈ గొర్రె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెగా రికార్డులకెక్కింది.

అంతకు మునుపు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును ఈ డబుల్ డైమండ్‌ బద్దలు చేసింది.ఇక దీని తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ పౌండ్ ‌లతో ‘హెక్సెల్‌ డ్జాంగో’ అనే గొర్రె రికార్డులకెక్కింది.కాగా… స్టాక్ ‌పోర్టు, చెషైర్ ‌‌కు చెందిన ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్ ‌కు చెందిన గొర్రెలలో ఈ డైమండ్ రకం ఒకటి.నెదర్లాండ్‌ లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందిన ఈ గొర్రెలు టెక్సెల్‌ జాతి రకానికి చెందినవి.

యూకేలో వీటిని ఎక్కువగా మాంసం కొరకు వినియోగిస్తూ ఉంటారు.వీటి మాంసం కూడా అదే ఖరీదులో ఉంటుంది.

Telugu Sheep, Cost, Hexal Donjo, Lamb, Meal, Mutton, Pounds, Ponds, Uksheep, Wor

మామూలుగా అయితే ఈ గొర్రె పిల్లలు 100 స్టెర్లింగ్‌ పౌండ్ల ధర పలుకుతుంటాయి.అధిక నాణ్యత కలిగిన గొర్రెలు మాత్రం అధిక మొత్తంలో అమ్ముడవుతూ ఉంటాయి.ఇకపోతే ఇలాంటి మేలైన జాతుల గొర్రెలను మాత్రమే సాధారణంగా బీడింగ్‌ కోసం వినియోయోగిస్తుంటారు.అయితే వీటి పెంపకం కూడా అంత తేలికైన విషయం కాదు మరి.వీటికోసం ప్రత్యేకమైన మెనూ ఉంటుందట కూడా.దానికి కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube