ఒక్క మామిడి కాయ రేటు రూ. 5 వేలు.... అంత ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

కొన్ని రోజుల్లో మామిడి పండ్ల సీజన్‌ మొదలు కాబోతుంది.సీజన్‌ ఆరంభంలో మామిడి పండ్లు కిలో 100 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

 Worlds Most Expensive Mango Egg Of The Sun-TeluguStop.com

బాగా సీజన్‌ ఉన్న సమయంలో కిలో మామిడి పండ్లు 20 లేదా 30 రూపాయలకే వస్తాయి.కొన్ని ప్రాంతాల్లో మామిడి పండ్లు అయిదు పది రూపాయలకు కూడా లభిస్తాయి.

ఇండియాలో మామిడి పండ్ల తోటలు భారీగా ఉన్న కారణంగా రేటు తక్కువగా ఉంటుంది.అయితే సాదారణ మామిడి పండ్ల విషయం పక్కన పెడితే జపాన్‌లో పండించే మామిడి పండ్ల రేట్లు అధికంగా ఉంటాయి.

 Worlds Most Expensive Mango Egg Of The Sun-ఒక్క మామిడి కాయ రేటు రూ. 5 వేలు#8230;. అంత ప్రాముఖ్యత ఏంటో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధికంగా అంటే ఏ వందో రెండు వందలో కాదు.ఏకంగా వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది

జపాన్‌లో మాత్రమే కనిపించే అరుదైన మామిడి రకం మియజాకీ మామిడి పండు.ఈ మామిడి పండు మన వద్ద ఉండే మామిడి పండుతో పోల్చితే 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉండటంతో పాటు, ఆరోగ్యంకు చాలా మంచింది.మియాజాకీ మామిడి పండ్లను అక్కడ తోటల్లో కాకుండా కుండీల్లో పెంచుతారు.

మియాజాకీ మామిడి చెట్లు అనకుండా మొక్కలు అనాల్సి ఉంటుంది.

ఎందుకంటే మొక్కలుగా ఉన్న సమయంలోనే అంటే మూడు నాలుగు ఫీట్ల ఎత్తు ఉన్న సమయంలోనే ఆ మొక్కలు కాయలను కాస్తుంది.అలా కాసిన కాయలు చాలా జాగ్రత్తగా నిర్వహణ చేయాల్సి ఉంటుంది.అందుకే ఒక్క మామిడి కాయ రేటు ఏకంగా నాలుగు వేల నుండి అయిదు వేల వరకు ఉంటుంది

కేజీ కూడా ఉండని మామిడి కాయ అయిదు వేల రూపాయలు ఉండటం అంటే ఆ పండు విశిష్టత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అత్యధికంగా తీపి ఉండటంతో పాటు, పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందనే టాక్‌ ఉంది.ఎలాంటి విష ప్రయోగాలు ఆ మామిడిపై జరగవు, పూర్తిగా శాస్త్రీయ పద్దతిలో పూర్తిగా కాలుష్యంకు దూరంగా ఆ మామిడి మొక్కలను పెంచి మియాజాకీ మామిడి కాయలను కాయిస్తూ ఉంటారు.

ఎన్నో ఔషద గుణాలు ఉన్న మియజాకీ మామిడి పండ్లు జపాన్‌ నుండి పలు దేశాలకు రవాణా అవుతూ ఉంటాయి.విదేశాల్లో వాటి రేటు మరింత పెరుగుతుంది.జపాన్‌ లో మాత్రమే అత్యధికంగా కనిపించే మియాజాకీ మామిడి పండ్లు ఇండియాలో కూడా మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube