ప్రపంచంలోనే ప్రమాదకర ల్యాప్ టాప్ ఖరీదు ఎంతో తెలుసా

ప్రాచీనమైన వస్తువులు, లేదంటే ప్రముఖులు ఉపయోగించిన వస్తువులకి వేలంలో చాలా డిమాండ్ ఉంటుంది.చాలా మంది కోటీశ్వరులు అలాంటి ప్రాచీన, అరుదైన సంపదని తప దగ్గర ఉంచుకోవాలని కోట్ల రూపాయిలు వాటి కోసం వెచ్చిస్తూ ఉంటారు.అయితే వీటికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ల్యాప్ టాప్ గా గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌పై వేలం నిర్వహించగా 1.3 మిలియన్‌ డాలర్లకి అమ్ముడు పోయింది.ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ప్రముఖ కంపెనీలకు 90 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.

 Worlds Most Dangerous Laptop Is On Sale For 1 2 Million-TeluguStop.com

ది పర్సిస్టెన్స్‌ ఆఫ్‌ ఖోస్‌’గా పేర్కొనే ఈ డివైజ్‌లో ప్రపంచాన్ని గడగడలాడించిన వాన్నాక్రై, ఐలవ్‌యూ, డార్క్‌ ఎనర్జీ, సోబిగ్‌, మైడూమ్‌, డార్క్‌టెక్విలా’ వైరస్‌లు, రాన్సమ్‌వేర్‌లు ఉన్నాయి.

యూకేలోని ఎన్‌హెచ్‌ఎస్‌పై ఈ రాన్సమ్‌వేర్‌ దాడి చేయడంతో దాదాపు 4 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.ఇక ఈమెయిల్‌, ఫైల్‌షేరింగ్‌ల ద్వారా వ్యాపించే ‘ఐలవ్‌యూ’ వైరస్‌ దాడిలో 5.5 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చింది.డార్క్‌ టెక్విలా లాటిన్‌ అమెరికాలోని వినియోగదారుల బ్యాంకు ఖాతాలు, కార్పొరేట్‌ డేటాలాంటి సున్నితమైన సమాచారాన్ని తస్కరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube