ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ ఇక లేనట్టేనా..?!

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ A68.ఈ మంచుకొండ రోజురోజుకు కనుమరుగైపోతోంది.

 Worlds Largest Giant Ice Berg A 68 Melts Away-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత పొందిన ఈ ఐస్ బర్గ్ రోజురోజుకీ కరిగిపోతూ.అంటార్కాటికా మహా సముద్రంలో కలిసిపోతుంది.

ఈ మంచుకొండ 2,300 చదరపు మైళ్లు విస్తీర్ణంలో వ్యాపించింది.అయితే ప్రస్తుతం ఈ మంచుకొండ రోజురోజుకు అంతరించిపోతోంది.

 Worlds Largest Giant Ice Berg A 68 Melts Away-ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ ఇక లేనట్టేనా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక 2017లో ఐస్‌బర్గ్ అంటార్కాటికా నుంచి చీలిపోయింది.ఒక చిన్న దేశమంతా పరిమాణంలో ఉన్న ఈ మంచుఖండం వేల్స్ విస్తీర్ణంలో మూడోవంతు ఉంటుంది.

తాజాగా శాటిలైట్లు నుండి తీసిన కొన్ని ఫోటోలను గమనిస్తే.మెగా బర్గ్ వర్చువల్ గా అదృశ్యమైపోయింది.ఇప్పుడు లేదు.లెక్కలేననంతగా చిన్న ముక్కలుగా చీలిపోయిందని యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది.ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని, ఒకప్పటి ఐస్ బర్గ్ ఇప్పుడు అక్కడ లేదని అంటోంది.A68 అనే అతిపెద్ద మంచుభాగం అంటార్కిటికాలోని పెనిన్ సులా కొనలో భాగం.ఏడాది క్రితం ఈ భాగం పక్కకు జరిగిపోయింది.ఉత్తరం నుంచి కరిగిపోతోంది.

Telugu Atlantic, Ice Berg, Ice Berg A68 Melts Away, Ice Berg A68 Viral Photo, Ice Berg A68 Virtually Gone, Melting, Melting Photos, Photos Vital, Us National Ice Center, Viral News-Latest News - Telugu

అయితే బలమైన గాలుల పీడనానికి మంచు భాగమంతా చెల్లాచెదరుగా మారిపోయిందని ఆ ఫోటోను చుస్తే అర్ధం అవుతుంది.ఇక బిలియన్ టన్నుల ఈ మంచు పలక.దక్షిణ అట్లాంటిక్‌లోకి బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఆఫ్ సౌత్ జార్జియా వైపు తిరుగుతోంది.దీనికారణంగా చాలా పెద్ద మంచుకొండలు కరిగిపోనున్నాయి.

అంట్లాటిక్ లో ఉష్ణోగ్రతల్లో గాలి అత్యధికంగా పెరగడంతో పాటు నీళ్లు వేడక్కడం ద్వారా మంచుకొండ కరిగిపోతోంది.చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి కరిగిపోతోంది.

ఇక A68 ఎందుకు ఇలా అర్థాంతరంగా కరిగిపోతోందో అధ్యయనం చేసేందుకు గత ఫిబ్రవరి నెలలో సముద్రంలోకి కొన్ని రోబోలను పంపింది.అందులో ఒకటి మంచు ముక్కల్లో రెండు వారాల పాటు చిక్కుకుపోయింది.

అయినప్పటికీ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించింది.రెండు వారాల తర్వాత మే నెలలో రోబో లభ్యమైంది.A68కు సంబంధించి సమాచారాన్ని సేకరించింది.ఆ డేటా ఆధారంగా అధ్యయనం చేయగా.

సముద్రంలోకి భారీగా కొత్త నీళ్లు రావడం ద్వారా మంచు కరిగిపోయి ఉండొచ్చునని అధికారులు చెప్పారు.

#UsNational #IceBerg #Melting #IceBerg #Atlantic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు