ప్రపంచపు అతిపెద్ద విమానం శంషాబాద్ లో

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా రికార్డు కెక్కిన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఉదయం ల్యాండయింది.ఆరు టర్బో ఫ్యాన్ ఇంజన్లతో ఉండే ఈ భారీ లోహ విహంగం ఏకంగా 640 టన్నుల బరువును మోసుకెళ్లగలుగుతుంది.

 World’s Largest Cargo Aircraft Lands In Shamshabad Airport-TeluguStop.com

ఈ విమానం తుర్కమెనిస్థాన్ నుంచి ఆర్జీఐఏకు రాగా, విమానాశ్రయ అధికారులు నీళ్లు చల్లి సంప్రదాయ స్వాగతం పలికారు.చెక్ రిపబ్లిక్ నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న విమానం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చింది.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులోని పొడవైన రన్ వే, విమానం ల్యాండింగ్ కు అనుకూలమన్న భావనతోనే, ఈ విమానం ఇక్కడ ల్యాండయింది.చెక్ రిపబ్లిక్‌లో తయారు చేసిన 133 టన్నుల జనరేటర్‌ ను ఈ విమానం ఆస్ట్రేలియాకు చేర్చాల్సి వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube