ఆ వ్యాధికి త్వరలోనే టీకా దొరకబోతోంది

భయం కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కుష్టు వ్యాధి కేసుల్లో 58 శాతం భారతీయిలే ఉంటున్నారు.ఈ కేసుల్లో 10% మంది పిల్లలు ఉంటున్నారు.

 World’s First Vaccine For Leprosy Will Be Available Soon-TeluguStop.com

ఇది నిజంగా ప్రమాదకరమైన సూచనే.ఇందువల్లనే దేశంలో మొట్టమొదటిసారిగా కుష్టు వ్యాధి కోసం టీకా రాబోతోంది.

దీన్ని ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.

భారతదేశంలోనే తయారుచేసిన ఈ టీకాను మొదట పైలట్ ప్రాజెక్టు కింద బిహార్, గుజరాత్‌లోని ఐదు జిల్లాల్లో ఉపయోగించనున్నారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ డైరక్టర్ డాక్టర్ జేపి తల్వార్ ఈ వ్యాక్సిన్ ను ప్రజల కోసం అభివృద్ధి చేసారు.సెంట్రల్ లెదర్ రిసర్చ్, సాక్షం, రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో జరిగిన కుష్టు వ్యాధి అవగాహన సదస్సులో మంత్రి ఈ టీకాను ప్రకటించారు.

ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ కుష్టువ్యాధి కేసులను మూడేళ్ళలో 60% వరకు ఈ టీకా తగ్గిస్తుందని, అలాగే శరీర గాయాలని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని, కుష్టువ్యాధి బారిన పడినవారికే కాకుండా, వారితో గడుపుతున్న వారికి కూడా ఈ టీకా ఉపయోగపడుతుందని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube