నిత్యం వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో రోడ్డు ప్రమాద వార్తలు వింటూనే ఉంటాం.ఎక్కడో ఒక చోట లారీ ప్రమాదం, లేదంటే బస్సు ప్రమాదం, కారు-లారీ ఢీ కొట్టుకున్న ప్రమాదం, నదిలోకి దూసుకెళ్లిన కారు అనే వార్తలు సాధారణం అయిపోయాయి.
కానీ చరిత్రలో తొలిసారి కారు ప్రమాదం ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? అసలు ఆ దిశగా ఎవరైనా ఆలోచించారా? అంటే లేదనే చెప్పుకోవచ్చు.అసలు ఇంతకీ ఫస్ట్ కార్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.ఈ భూమ్మీద తొలి కారు ప్రమాదం అమెరికాలో జరిగింది.1891లో ఒహైయో రాష్ట్రంలోని క్లేవ్ లాండ్ లో జరిగింది.నిజానికి అంతకు ముందు నుంచే కార్లు ఉన్నాయి.అయితే అవన్నీ స్టీమ్ ఇంజిన్ తో పని చేసేవి.వాటిని ఆధునిక కార్లతో పోల్చేవారు కాదు.అందుకే వాటి ప్రమాదాలను కారు ప్రమాదాల కింద చరిత్రకారులు గుర్తించలేదు.
జాన్ విలియం లాంబెర్ట్ సొంతంగా కారు తయారు చేశాడు.దాన్ని నడిపిస్తుండగా ప్రమాదం జరిగింది.
దాన్ని ప్రపంచంలోనే తొలి కారు ప్రమాదంగా చరిత్ర గుర్తించింది.

వాస్తవానికి ఈ ప్రమాదం ఎలా జరిగింతో ఇప్పుడు తెలుసుకుందాం.లాంబెర్ట్ ఓ మెకానికల్ ఇంజినీర్.ఆయన రకరకాల వస్తువులను కనిపెట్టి సుమారు 600 ఆవిష్కరణలకు పేటెంట్ రైట్స్ పొందాడు.
అమెరికాలో తొలిసారి గ్యాసోలిన్ ఆటోమోబైల్ కారును 1890-91లో తయారు చేశాడు.ప్రస్తుత కార్లకు మూలం ఈకారు అని చెప్పుకోవచ్చు.
ఈ కారు తయారు చేసిన తర్వాత దాన్ని టెస్ట్ రన్ చేసేందుకు బయల్దేరాడు.ఆయనతో పాటు స్వేవ్లాండ్ అనే మరో బిజినెస్ మ్యాన్ ను ఈ కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు.
ఒహైయో నగరంలో చక్కర్లు కొట్టారు.ఒక చోట చెట్టు వేర్లు కారుకు తగిలాయి.
కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఫెన్సింగ్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మామూలుగా గాయపడ్డారు.
ఆ తర్వాత ఈ కారులో మరిన్న మార్పులు చేసి కొత్త కారును రూపొందించాడు లాంబెర్ట్.