ప్రపంచంలో అత్యంత చల్లని గ్రామం ఏదో తెలుసా..?

భారతదేశంలో చలికాలం ప్రారంభమై రెండు నెలలైంది.ఉష్ఙోగ్రతలు క్రమంగా తగ్గుతుండటంతో ప్రజలు చలికి గజగజా వణుకుతున్నారు.

 Worlds Coldest Village Photos Goes Viral In Social Media, Oymyakon,worlds Coldes-TeluguStop.com

సంక్రాంతి పండుగ నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.అయితే తక్కువ ఉష్ణోగ్రతలకే మన దేశ ప్రజలు గజగజా వణుకుతుంటే ఒక గ్రామంలో మాత్రం – 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామంగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం రష్యా దేశంలోని సైబీరియాకు సమీపంలో ఉంది.మనం 16 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ఙోగ్రతకే గజగజా వణికిపోతే అక్కడి ప్రజలు మాత్రం -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా జీవనం సాగిస్తున్నారు.ఆ గ్రామం జనాభా 900 కాగా 1924 సంవత్సరంలో ఆ గ్రామంలో -71.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

Telugu Degrees Celsius, Antarkitica, Oymyakon, Russia, Worlds Coldest, Worldscol

అంటార్కిటికా వెలువల ఉన్న ఈ గ్రామంలో పంటలు పండవు.మాంసాహారాన్ని వండుకుని ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు.ఉదయం 10 గంటలకు సూర్యుడు కనిపించే ఈ వింత గ్రామం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే శీతాకాలంలో మాత్రమే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని మిగతా కాలాల్లో ఇంత చల్లని వాతావరణం ఉండదని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ గ్రామంలో ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది.– 50 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత మరింత తగ్గితే ఇక్కడ పిల్లలు పాఠశాలలకు హాజరు కారు.ఈ గ్రామంలోని ప్రజలు తీవ్రమైన జలుబు సమస్యతో ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు.ఈ వింత గ్రామానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ గ్రామం గురించి తెలిసి నెటిజన్లు సైతం అంత తక్కువ ఉష్ణోగ్రతలో జీవించడం అంత తేలిక కాదని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చలి పెట్టకుండా ఇక్కడి ప్రజలు ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube