ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం..38 మంది భార్యలున్న వ్యక్తి ఇకలేరు..!

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబంగా ఓ కుటుంబం రికార్డుకెక్కింది.మిజోరాకి చెందిన జియోన చన కుటుంబం ఆ రికార్డుతో కొనసాగుతోంది.

 Worlds Biggest Family Man Ziona Chana Died In Mizoram, World Biggest Family, 32-TeluguStop.com

అయితే అనారోగ్యంతో జియోన చన కన్నుమూశాడు.గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు.

ఆయన కొన్ని రోజుల నుంచి డయాబెటిస్,హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నాడు.ప్రస్తుతం తన నివాసంలోనే చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

అనారోగ్యం చెందిన ఆయన్ను కుటుంబీకులు ఐజ్వాల్ లోని ట్రినిటీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధ్యాహ్నాం 3గంటల సమయంలో చివరి శ్వాస విడిచారు.1945 జులై 21న జియోన చన జన్మించారు.38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండటం వల్ల ఆయన రికార్డుకెక్కాడు.ఇప్పటి వరకూ అతి పెద్ద కుటుంబం ఆయనదే.ఇది ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.మిజోరాం ముఖ్యంత్రి జోరాంతంగ జియోనచన కుంటుంబానికి సంతాపం తెలిపాడు.ఈ సందర్భంగా ఆయన అతి పెద్ద కుటుంబం చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ నివాళులు అర్పించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం పెద్దగా మిజోరాం వాసి మిస్టర్ జియోన్‌ రికార్డు నెలకొల్పడం సంతోషకరమైన విషయమే అయినా ఆయన చనిపోవడం పట్ల సంతాపం తెలిపారు.ఆయన మృతదేహానికి వీడ్కోలు పలికారు.

Telugu Aizwal, Guinness, Meida, Unhealthy, Biggest, Worlds Biggest, Ziona Chana-

ఆయన్ని చూడటానికి బక్తంగ్ త్లంగ్నాం గ్రామంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.మిజోరాం పర్యాటకానికి ఆయనొక సెంట్రాఫ్ అట్రాక్షన్ అని సీఎం ట్వీట్ లో తెలిపాడు.జియోన చన 17 ఏళ్ల ప్రాయంలో పెళ్లి చేసుకున్నాడు.ఫస్టు భార్య ఆయన కంటే మూడేళ్లు పెద్దది.ఆయన కుటుంబం మొత్తం చుహాన్‌ తార్‌ రన్‌ అనే నాలుగు అంతస్తుల పెద్ద భవనంలో జీవిస్తోంది.ఆ భవనంలో దాదాపుగా 100 గదులున్నాయి.

ఆయన కొడుకులు, కోడళ్లు, పిల్లలు వేర్వేరు గదుల్లో ఉన్నప్పటికీ అందరికీ వంటగది ఒకటే ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube