ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో   World’s Biggest Cricket Stadium To Be Constructed In India With 700cr     2017-01-17   04:13:04  IST  Raghu V

మనదేశంలో క్రికెట్ అంటే దేవుడు లేకున్నా అన్నిమతాలవారు పూజించే మతం అని వేరే చెప్పాలా! క్రికేట్ కి ఇక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లో లేనన్ని క్రికేట్ స్టేడియమ్స్ మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం కూడా మన దేశంలోనే తయారవబోతోంది.

అహ్మదాబాద్‌లోని మొతేరాలో ఇప్పటిదాకా ఉన్న క్రికేట్ స్టేడియంని కూల్చేసి కొత్త స్టేడియం కట్టబోతున్నారు. దీనికి సర్దార్ పటేల్ స్టేడియం అని నామకరణం చేశారు. ఇక ఈ స్టేడియం కెపాసిటీ ఎంత ఉండబోతోందో తెలుసా? అక్షరాల 1,10,000. అవును, ఒక లక్ష పదివేల మంది ఈ గ్రౌండ్ లో కూర్చోని మ్యాచ్ చూడగలరు.

ప్రస్తుతానికి ప్రపంచంలోని అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంది. దీని కెపాసిటి 1,00,024. ఇప్పుడు సర్దార్ పటేల్ స్టేడియం మరో పదివేల ఎక్కువ కెపాసిటితో ముస్తాబవబోతోంది.

ఈ కట్టడం కోసం ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. 63 ఎకరాల్లో, రెండు సంవత్సరాలలో పూర్తయ్యే ఈ గ్రౌండ్ లో 3000 కార్లు, 10,000 టూవీలర్స్ పార్క్ చేసే సదుపాయం ఉండబోతోందని అధికారులు తెలిపారు.