ప్రపంచంలోని ఆ ఐదుగురు సీరియ‌ల్ కిల్ల‌ర్స్‌.. హాబీ కోస‌మే చంపేవార‌ట‌!

సాధారణంగా హత్య వెనుక ఒక కారణం ఉంటుంది.లేదా ఒకరి మీద పగ తీర్చుకోవడానికి హత్యలు చేస్తారు.

 World Top Serial Killers , Jack The Ripper, John Von Geese, Andre Chicato, Dr. Harold Shipman, Ted Bundy, Serial Killers-TeluguStop.com

అయితే కొంతమంది హంతకులు తమ హాబీ కోసమే చంపుతారనే విష‌యం మీకు తెలియ‌క‌పోవ‌చ్చు.ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.జాక్ ది రిప్పర్బ్రిటన్‌లోని లండన్‌లో 1888లో జాక్ ద రిప్పర్ అనే కరడుగట్టిన నేరస్థుడు హత్యలతో నగరంలో సంచలనం సృష్టించాడు.అయితే ఈ నేరస్థుడి అసలు పేరు మాత్రం బయటపెట్టలేదు.అతను కేవలం ఆడ వేశ్యలను మాత్రమే చంపేవాడ‌ని చెబుతారు.అతను వారి మెడను నరికి, శరీరం నుండి అంతర్గత అవయవాలను కూడా బయటకు తీసేవాడ‌ట‌.
2.జాన్ వాన్ గీస్జాన్.సెక్స్ నేర‌స్థుడు సీరియల్ కిల్లర్‌గా గుర్తింపు పొందాడు.పిల్లల ఆసుపత్రులకు, పిల్లల పార్టీలకు మ్యాజిక్ చేసేందుకు వెళ్లేవాడు.వింత వేషధారణలో పిల్లలకు వినోదం పంచి, కిడ్నాప్ చేసేవాడు.ఆ త‌రువాత‌ పిల్లలపై అత్యాచారం చేసి, చంపేవాడ‌ని పోలీసులు చెబుతుంటారు.
3.ఆండ్రీ చికాటిలొఆండ్రీ చికాటిలొ అనే హంత‌కుడు రష్యాలో 1978లో హత్యలు చేయడం ప్రారంభించాడు.మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాడు.

పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పుడు, అతను 56 మంది మహిళలు, పిల్లలపై అత్యాచారంచేసి, హత్య చేసినట్లు వెల్ల‌డించాడు.
4.డాక్టర్ హోరాల్డ్ షిప్‌మన్

 World Top Serial Killers , Jack The Ripper, John Von Geese, Andre Chicato, Dr. Harold Shipman, Ted Bundy, Serial Killers-ప్రపంచంలోని ఆ ఐదుగురు సీరియ‌ల్ కిల్ల‌ర్స్‌.. హాబీ కోస‌మే చంపేవార‌ట‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హెరాల్డ్ షిప్‌మాన్ 200కు మించిన‌ హత్యలకు పాల్పడ్డాడు, వృత్తిరీత్యా వైద్యుడు.ఎవరికీ అనుమానం రాని విధంగా పేషెంట్లను హత్య చేసేవాడు.ఒంటరిగా జీవించేవాడ‌ని, తోటి వైద్యులకు దూరంగా ఉండేవాడ‌ని చెబుతారు.
5.టెడ్ బండీ1970ల నాటి సీరియల్ కిల్లర్ టెడ్ బండీ అనేక యూఎస్ నగరాల్లో అందమైన స్త్రీలపై అత్యాచారం చేసి, ఆపై హ‌త్య చేస్తుండేవాడు.ఈ కోవ‌లో 36 మంది మహిళలను హత్య చేశాడు.అత్యాచారం, హత్యల లాంటి క్రూరమైన నేరాల కేటగిరీ కింద ఫ్లోరిడాలో ఎలక్ట్రిక్ కుర్చీకి కట్టేసి అతనికి మరణశిక్ష విధించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube