వరల్డ్‌ స్లీపింగ్‌ డే స్పెషల్‌... సుఖమయ నిద్రకు ప్రముఖుల చక్కని సూచనలు  

World Sleep Day Special-march 15th

మనిషి ఎంత కష్టపడ్డా కూడా రెండు మూడు గంటల పాటు సుఖమయ నిద్ర పోతే మళ్లీ మునుపటి ఉత్సాహంతో ఆనందంగా మళ్లీ రోజును ప్రారంభిస్తాడు. నిద్ర అనేది మనిషి జీవితంలో చాలా కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి సరైన నిద్ర లేకపోతే కొన్ని రోజులకు చనిపోతాడని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు..

వరల్డ్‌ స్లీపింగ్‌ డే స్పెషల్‌... సుఖమయ నిద్రకు ప్రముఖుల చక్కని సూచనలు-World Sleep Day Special

కొన్ని రోజుల పాటు నిద్రకు దూరంగా ఉండే వారు అనారోగ్యం బారిన పడి, చివరకు మృతి చెందారని వారు తెలియజేశారు. శరీరంలోని అవయవాలు మరియు అన్ని భాగాలు కూడా బాగా పని చేయాలి అంటే మనిషికి మంచి నిద్ర అవసరం అంటూ వైధ్యులు కూడా అంటున్నారు.

మార్చి 15న ప్రపంచ నిద్ర దినోత్సవం. ఈ సందర్బంగా మంచి నిద్ర కోసం ప్రముఖుల సుచనలు మీకోసం.

ఈమద్య కాలంలో పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని మనిషి సరైన నిద్రకు దూరం అవుతున్నాడు. సర్వేలో తేలిన విషయం ఏంటీ అంటే మనిషి సరైన నిద్ర పోక పోవడంకు ప్రధాన కారణం మొబైల్స్‌ మరియు టీవీలు. ఈ రెండింటి కారణంగా నిద్రకు దూరం అవుతున్నారట.

పడుకునే మందు టీవీ చూడటం, మొబైల్‌ చూసే అలవాటు కారణంగా సరైన నిద్ర లభించదని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంట ముందు మొబైల్‌ మరియు టీవీలను పక్కన పెడితే మంచి నిద్ర పోవచ్చు.

నిద్రంచే ప్రదేశం ఏదైనా కూడా అనువుగా ఉండేలా చూసుకోవాలి.

ఏదోలా పడుకుందా అనుకోకుండా నీట్‌గా ఉన్న ప్రాంతంలో, చక్కని బెడ్‌ పై లేదా నేలపై అయినా మంచి బెడ్‌ షీట్‌ వంటిది వేసుకుని నిద్రించాలి.

ఫ్యాన్‌ ఎక్కువగా శబ్దం రాకుండా చూసుకుని, చుట్టు పక్కల శబ్దాలు లోనికి రాకుండా ఇంట్లో ఏర్పాట్లు చేసుకోవాలి.

ఒకసారి పడుకుంటే మళ్లీ తెల్లవారు జాము వరకు నిద్ర లేవకుండా ఉండాలి అంటే మొబైల్‌ వంటివి ఆఫ్‌ చేయడం బెటర్‌. మెసేజ్‌ వచ్చినా, ఏదైనా నోటిఫికేషన్‌ వచ్చినా మెలుకువ వస్తుంది.

అందుకే మొబైల్‌ను ఆఫ్‌ చేస్తే మరి మంచిది..

మీరు పడుకున్న సమయంలో ఇరుకుగా, లేదంటే ఇబ్బందిగా అస్సలు పడుకోవద్దు. అలా పడుకోవడం కంటే పడుకోకుండా ఉండటం బెటర్‌.

ఎందుకంటే అలా ఇబ్బంది పడుతూ పడుకుంటే శరీరం ఇంకా అలసి పోతుంది. నిద్ర పోయిన ఫీలింగ్‌ ఉన్నా కూడా శరీరంకు కావాల్సిన విశ్రాంతి దక్కదు.

నిద్రలో కలలు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే ఎక్కువ శాతం పడుకునే సమయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండాలి.

ముఖ్యంగా పలు చెడు ఆలోచనలు కలుగకుండా జాగ్రత్త పడాలి.

కొందరు పడుకున్న సమయంలో కళ్ళకు గంతలు కట్టుకుంటారు. లైట్ ఫోక్స్ పడి నిద్రకు ఇబ్బంది కలుగకుండా అలా చేస్తారు.

పడుకోవడానికి ముందు మెడిటేషన్‌ లేదా లైట్‌ సౌండ్‌ తో మెలోడీ సాంగ్స్‌ వినడం కూడా చాలా మంచి అలవాటు..

పడుకోవడం మానవ శరీరంకు చాలా అవసరం. అందుకే మంచి నిద్రకు ఈ నియమాలు పాటించి ఆరోగ్యంను కాపాడుకోండి.

ఈ చక్కని విషయాలను మీ స్నేహితులతో షేర్‌ చేసుకోండి.