ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు మృతి..!

ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది.మృతి చెందిన రాణి బుట్టి జాతికి చెందిన మరుగుజ్జు ఆవు.

 World Shortest Cow Rani Of Bangladesh Died,  World Shortest Cow, Died, Passes Aw-TeluguStop.com

దీని వయసు 23 నెలలు, ఎత్తు 51 సెంటిమీటర్లు, బరువు 26 కేజీలు.నిలబడితే ఏడాది పాపకంటే ఆ ఆవే తక్కువుగా ఉండేది.

అయితే రాణి మృతి వార్త ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చారి గ్రాముకు చెందిన ఎంఏ హాసన్ హావల్దార్ ఈ రాణిని పెంచుకుంటున్నాడు.

అయితే ఈ ఆవు పొట్టిగా, అందంగా ఉండడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.దీంతో రాణిని చూసేందుకు నిత్యం వేల సంఖ్యలో జనం వచ్చి చూసేవారు.

సెల్ఫీలు తీసుకుని మురిసిపోయేవారు.అలాంటి రాణి ఇంతలోనే మృతి చెందడం తన యజమాని హాసన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

యజమాని హసన్ రాణి మాట్లాడుతూ.రాణి కొంచెం గడ్డి తింటే చాలు, చాలా యాక్టివ్ గా ఉండేదని, అయితే కొన్ని రోజుల నుంచి అసలు గడ్డి తినేది కాదని, దీంతో పశువుల ఆస్పత్రికి తీస్కెళ్లామని తెలిపారు.

Telugu Gasproblem, Guinness, Hasan, Rani Cow, Latest, Shortest Cow-Latest News -

అయితే దానికి కడుపులో గ్యాస్ ఫార్మ్ అయ్యిందని, వైద్యం చేయించినా ఫలితం లేకపోయిందని, రాణిని రక్షించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా బ్రతికించ లేక పోయారని రాణి గురించి చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు.అలా రాణి 2021 వ సంవత్సరం ఆగస్టు 19న తన ప్రాణాలు కోల్పోయిందని హాసన్ కన్నీటి పర్యంత అయ్యారు.

బుట్టి జాతికి చెందిన ఆవులు చాలా పొట్టిగా ఉంటాయి.అయితే వాటిల్లో కెల్లా రాణి ఇంకా పొట్టిది కావడం తో సెలబ్రిటీగా మారింది.ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవుగా గిన్నిస్ రికార్డు కెక్కిన కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవుకంటే రాణి 10 సెంటిమీటర్లు పొట్టిది.

Telugu Gasproblem, Guinness, Hasan, Rani Cow, Latest, Shortest Cow-Latest News -

రాణి కూడా బ్రతికుంటే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేది.బుట్టి జాతి ఆవులను ఎక్కువగా మాంసం విక్రయానికి పెంచేవారు.అయితే రాణిని కూడా మాంసం కోసం అమ్మేస్తారేమో నని రాణి అభిమానులు ఆందోళన చెందారు.

అదే విషయాన్నీ రాణి యజమాని హాసన్ ను అడిగితే ఇంత అందమైన రాణిని మాంసం కోసం ఎప్పటికీ అమ్మను అని తెలిపారు.అలా రాణి మరణం హాసన్ తో పాటు అభిమానులకు ఆవేదన మిగిల్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube