ప్రపంచంలోనే నిజాయితి కలిగిన నగరాలేవో తెలుసా..?!

ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి.అందులో ఎన్నో నగరాలూ ఉన్నాయి.

 World Most Honest Cities In The World List-TeluguStop.com

అయితే ఒక్కో దేశానికి, ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.ఆ దేశం లేదా నగరం యొక్క ప్రత్యేకతను బట్టి గుర్తు పెట్టుకుంటూ ఉంటాము.

అయితే నిజాయితీ గల నగరాలను ఎప్పుడైనా చూసారా.? పోనీ అలాంటి నగరాలు ఎక్కడైనా ఉంటాయా అన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా.? ఒకవేళ మీకు అలాంటి సందేహాలు ఉన్నట్లయితే.ఇది మీకోసమే.

 World Most Honest Cities In The World List-ప్రపంచంలోనే నిజాయితి కలిగిన నగరాలేవో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా కొంతమంది ప్రపంచ దేశాల్లో ఏ నగరం అందంగా ఉంటుంది.? ఏ నగరం నివాసానికి మంచిది.? లాంటి సర్వేలు చేస్తూ ఉంటారు.అలా సర్వే చేసే వారికి ఏ నగరాల్లో నిజాయితీ గల పౌరులు ఉన్నారో.

ఏ నగరం నిజాయితి గలది తెలుసుకోవాలనే సందేహం వచ్చిందట.వెంటనే ఈ సందేహానికి సమాధానం వెతికే ప్రయత్నంలో పడ్డారు.అందులో భాగంగానే కొంచెం ఖర్చు అయినా ఒక ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు.రీడర్స్ డైజెస్ట్ ఓ సామాజిక ప్రయోగం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రీడర్స్ డైజెస్ట్ విలేకరులు 16 నగరాలను ఎంచుకుని ప్రయోగం మొదలు పెటారు.వాటిల్లో ఆమ్స్టర్ డ్యామ్, బెర్లిన్, బుకారెస్టు, బడా పెస్ట్, హెల్సింకి, లిస్బన్, లుబ్జానా, లండన్, మాడ్రిడ్, మాస్కో, ముంబై, న్యూయార్క్ , ప్రేగ్, రియోడి జనీరో, వార్ సా, జ్యూరీచ్ నగరాలలో ఒక్కో నగరంలో 12 వాలెట్లు చొప్పున మొత్తం 192 వాలెట్లను వదిలేశారు.

అందులో యాభై డాలర్ల విలువైన స్థానిక కరెన్సీ, వ్యాపారానికి సంబంధించిన కార్డులు, గిఫ్ట్ కూపన్లు, మొబైల్ నెంబర్, వారి కుటుంబ సభ్యుల ఫోటోలను ఉంచారు.కొన్ని రోజుల తరువాత ఈ నగరంలో ఎన్ని వాలెట్లు తిరిగి వస్తాయోనని పరిశీలించారు.

Telugu Cuties, Honest Cities Of World, Honest City, Honest City Mumbai Second Place, Lisbon, Poland Helsinki First Place, Readers Digest Survey, Social Media, Viral Latest, Viral News, Wallets-Latest News - Telugu

అంటే ఒకవేళ ఎవరికైనా ఈ వాలెట్లు దొరికితే వారు అందులోని ఫోన్ నెంబర్.కార్డుల్లోని అడ్రస్ ఆధారంగా వాలెట్ గల వారికి అప్పగిస్తారా.? లేక వాలెట్ ఇవ్వకుండా వాళ్లే వాడుకుంటారా అనేది ప్రశ్న.ఇక ఇందులో ఫిన్లాండ్ దేశానికి చెందిన హెల్సింకి మొదటి స్థానంలో నిలిచింది.

అక్కడ వీరు వదిలి పెట్టిన 12 వాల్లెట్లలో 11 తిరిగి వచ్చాయి.ఇక మన దేశానికి ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో 9 వాలెట్లు వెనక్కి వచ్చాయి.

దీంతో ముంబై రెండో స్థానంలో నిలిచింది.ఇక చివరి స్థానంలో పోర్చుగల్ కు చెందిన లిస్బన్ నిలిచింది.

ఇక్కడ 12 వాల్లెట్లలో ఒకే ఒక్క వాలెట్ వెనక్కి తిరిగి వచ్చింది.మొత్తానికి 16 నగరాలలో రీడర్స్ డైజెస్ట్ విలేకరులు 192 వాలెట్లు వదిలేస్తే కేవలం 90 మాత్రమే తిరిగి రాగా.

మిగతావి దొరికిన వారు దోచుకున్నారు.

#Lisbon #Honest #Wallets #Honest Mumbai #Honest World

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు