గాల్లోకి ఎగిరిన ప్రపంచంలోనే అతి పెద్ద విమానం

ఒక విమానం ఫుట్ బాల్ స్టేడియం అంతా ఉంటుందన ఎవరైనా ఊహిస్తారా.కాని అది సాధ్యం అయ్యింది.

 World Largest Plane Started Going To The Sky-TeluguStop.com

ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా గుర్తింపు తెచ్చుకున్న విమానం విజయవంతంగా గాల్లోకి ఎగిరింది.అయితే గాల్లో ఎగిరిన ఈ విమానాన్ని చూస్తే రెండు విమానాలు పక్కపక్కనే వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

ఈ మహాద్భుత విమానాన్ని స్ట్రాటోలాంచ్‌ అనే విమానయాన సంస్థ అభివృద్ధి చేసింది.తమ తొలి పరీక్షను కూడా విజయవంతంగా పూర్తిచేసింది.

రెండు ఇంజన్స్ తో ప్రయాణించే ఈ విమానం గరిష్ఠంగా గంటకు 302.4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.విమానం బరువు దాదాపు 227 టన్నులు.ఒక్కో రెక్క 385 ఫీట్ల వెడల్పు, 238 ఫీట్ల పొడవు ఉంటుంది.కచ్చితంగా చెప్పాలంటే ఏ380 విమానం కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉంటుంది.ఆరు బోయింగ్‌ 747 ఇంజన్లతో ఇది నడుస్తుంది.

ఈ భారీ విమానాన్ని తొలిసారిగా శనివారం కాలిఫోర్నియాలోని మోజివ్‌ ఏయిర్‌ అండ్‌ స్పేస్‌ పోర్టు నుంచి ప్రయోగించారు.సముద్ర మట్టానికి 17వేల ఎత్తులో మోజివ్‌ ఎడారి మీదుగా 2.5 గంటలపాటు ప్రయాణించింది.అంతరిక్షంలోకి రాకెట్లను మోసుకెళ్లి, వదిలిపెట్టడానికి ఈ విమానాన్ని రూపొందించారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube