ఇండియా పై వైరల్ కామెంట్లు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మరణ సునామీకి ప్రభుత్వాలు మరియు ప్రపంచంలో ఇతర దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఇండియాలో కరోనా పరిస్థితులపై వైరల్ కామెంట్లు చేస్తున్నారు.

 World Health Organization Makes Viral Comments On India-TeluguStop.com

రోజుకి కొత్త కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరటం మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా గత వారం ప్రపంచం లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పరంగా చూసుకుంటే సగం మొత్తం ఇండియాలో నమోదయినట్లు WHO కీలక కామెంట్లు చేసింది.

 World Health Organization Makes Viral Comments On India-ఇండియా పై వైరల్ కామెంట్లు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ప్రతి 4 కోవిడ్ మరణాలలో ఒకటి భారత్ లోనే అని అంటోంది.అంతేకాకుండా ఆసియాలో నమోదవుతున్న కేసులలో 90% ఇండియా లోనివే అని స్పష్టం చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 46 శాతం ఇండియా నుండే కేసులు నమోదు అవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాలలో 25 శాతం భారత్ లోనివి అని నివేదికలో తెలిపింది.

ఇప్పటివరకూ కరోనా మరణాలు విషయంలో అగ్రస్థానంలో అమెరికా నిలవగా రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. 

.

#India #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు