ఆ ఊళ్ళో పండగ రోజు అందరూ బురదలో దొర్లుతారు... ఎందుకో తెలుసా

ప్రతి దేశంలో స్థానికంగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి.అలాంటి సంప్రదాయాలలో కొన్ని విచిత్రమైనవి కూడా ఉంటాయి.

 World Famous Mud Festival In Dimili Village-TeluguStop.com

వాటి గురించి విన్నప్పుడు ఇదెక్కడి ఆచారం అని అందరూ నవ్వుకుంటారు.కాని వారి ప్రాంతాలలో అలాంటి వింత ఆచారాలలో చాలా నిష్టతో చేస్తారు.

అలాగే ఇండియాలో కూడా కూడా చాలా ప్రాంతాలలో వింత వింత ఆచారాలు ఉన్నాయి.మన ప్రాంతంలో కూడా అలంటి ఆచారాలు ఉన్నాయి.

వాటిలో విశాఖ జిల్లా యలమంచిలి మండలం దివిలి గ్రామంలో బురద పండగ ఒకటి.

బురద పండగ ప్రత్యేకత ఏంటంటే ఆ పండగ రోజు మగవాళ్ళు అందరూ బురదలో దొర్లుతారు.

ఊళ్ళో ప్రతి మగాడు కచ్చితంగా బురద పూసుకుంటాడు.ఆ గ్రామంలో రెండేళ్ల కు ఒకసారి వచ్చే బురదమాంబ పండుగ చాలా ప్రత్యేకం.

ఊరిలో వున్న మురుగు కాలువల నీటీలో వేప కొమ్మలను ముంచి వాటిని ఒంటికి రాసుకుని పండుగ చేసుకంటారు.ఈ ఆచారం వెనుక ఓ కథ కూడా వుంది.

ఆ గ్రామంలో పూర్వ ఓ ఆర్ధరాత్రి కొంత మంది ఆకతాయిల నుంచి తప్పించుకుంటూ వచ్చి ఓ బురదగుంటలో దాక్కుంది.దానిని గమనించిన గ్రామస్తులు ఆమెని కాపాడే ప్రయత్నం చేసిన ఆమె భయంతో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

తరువాత ఆ బురద గుంట అమ్మవారి విగ్రహం గ్రామస్తులకి దొరికింది.ఆ చనిపోయిన ఆమె అమ్మవారిగా వెలిసారని గ్రామస్తులు భావించి.

ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి.ప్రతి రెండేళ్ళకి ఒక సారి బురదమాంబ పండగ చేసుకుంటారు.

ఆ రోజు మగవాళ్ళు అందరూ ఒంటికి బురద పూసుకొని సంబరాలు చేసుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube