వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ టాక్... మల్టీ వేరియేషన్స్ చూపించేశాడు

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విజయ్ కి జోడీగా ఏకంగా నలుగురు హీరోయిన్స్ కనిపిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమా మీద హైప్ క్రియేట్ చేసాయి.ఫిబ్రవరి14న ప్రేమికుల దినోత్సవం రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఈ ట్రైలరని షేర్ చేసుకున్నాడు.

 World Famous Lover Trailer Talk-TeluguStop.com

ఓ వైపు సింగరేణి బ్యాక్ డ్రాప్, మరో వైపు ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు.తన గౌతమ్ పాత్ర ద్వారా హీరో పాత్రని పరిచయం చేసిన దర్శకుడు డిఫరెంట్ షేడ్స్ లో ఆవిష్కరించారు.

ప్రేమలో ఉండే పెయిన్, లవ్, రొమాన్స్, కోపం, ద్వేషం లాంటి అన్ని ఎమోషన్స్ ని ఇందులో చూపించారు.అయితే ప్రేమ కథలో ఉండే ఎమోషనల్ ఎలిమెంట్ ని ఇందులో చూపించబోతున్నారు.

ప్రపంచంలో స్వార్ధం లేనిదీ ప్రేమ మాత్రమే అందులో ప్రేమ తప్ప ఏమీ ఉండదు.అయితే అందులో కూడా నేను అనే స్వార్ధం సునామీ సృష్టిస్తుంది అని భావించే యువకుడుగా ఇందులో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు.

ఇప్పటి వరకు తన ప్రతి సినిమాలో ఏదో ఒక ఎమోషన్ ని చూపించిన దేవరకొండ ఇందులో మాత్రం అన్ని రకాల షేడ్స్ ని చూపించాడు.ఓ వైపు సింగరేణి కార్మికుడుగా, మరో వైపు కోటీశ్వరుడు భిన్నమైన షేడ్స్ చూపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube