వరల్డ్ ఫేమస్ లవర్ అంత ముంచిందా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 World Famous Lover To Leave Huge Losses-TeluguStop.com

కాగా ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.ఇక సినిమా కంటెంట్ కూడా యూత్‌ను టార్గెట్ చేసి ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు దూరంగా ఉన్నారు.

దీంతో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా వచ్చాయి.మొదటి వారం ముగిసే సరికి ఈ సినిమాకు రూ.8 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు వచ్చాయి.దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అంత తక్కువ కలెక్షన్లు రావడంతో ఈ సినిమా నష్టాల బాట పట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అన్నారు.ఇక ఈవారం భీష్మ సినిమా రిలీజ్ కావడం, దానికి పాజిటివ్ టాక్ రావడంతో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం మరింత ఎక్కువ నష్టాలను మిగిల్చడం ఖాయమని అంటున్నారు.

ఈ సినిమా టోటల్ రన్‌లో బయ్యర్లకు ఏకంగా 50 శాతంకు పైగా నష్టాలను మిగిల్చనుంది.రూ.30 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా ఇంత భారీ నష్టాలను మిగిలిస్తుండటంతో విజయ్ దేవరకొండ సినిమాలను కొనేందుకు బయ్యర్లు భయపడుతున్నారు.మరి వరల్డ్ పేమస్ లవర్ టోటల్ రన్‌లో ఎంత నష్టాలను మిగిలుస్తుందో చూడాలి అని వారు లెక్కలేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube