రివ్యూ : ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఎంత ప్రేమను పంచాడో చూద్దాం రండీ  

World Famous Lover Movie Review-rashi Khanna,vijay Devarakonda,world Famous Lover

విజయ్‌ దేవరకొండ అనే పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బ్రాండ్‌.ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు.

World Famous Lover Movie Review-Rashi Khanna Vijay Devarakonda

కథ ఏంటీ.దర్శకుడు ఎవరు.నిర్మాత ఎవరు అనే విషయాలను పట్టించుకోకుండా విజయ్‌ దేవరకొండ ఉన్నాడు అనే ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని సినిమాకు వెళ్తున్నారు.అంతగా ప్రేక్షకులను కట్టి పడేస్తున్న విజయ్‌ దేవరకొండ గత చిత్రం డియర్‌ కామ్రేడ్‌తో నిరాశ పర్చాడు.

అయినా కూడా ప్రేక్షకులు ఏమాత్రం ఆయనపై నమ్మకం కోల్పోలేదు.ఈ చిత్రంతో సక్సెస్‌ కొడతాడనే నమ్మకంను కలిగి ఉన్నారు.

మరి రౌడీ స్టార్‌ ఈ విభిన్నమైన ప్రేమ కథలతో సక్సెస్‌ కొట్టాడా ఈ రివ్యూలో చూద్దాం రండీ.

కథ : కాలేజ్‌ డేస్‌ నుండి గౌతమ్‌(విజయ్‌ దేవరకొండ), యామిని(రాశిఖన్నా)ు ప్రేమించుకుంటారు.అయితే వారి ప్రేమ మద్యలో బ్రేకప్‌ అయ్యి మళ్లీ వారు కలుస్తారు.మరో వైపు బొగ్గు గనిలో పని చేసే శీనయ్య(విజయ్‌ దేవరకొండ), సువర్ణ(ఐశ్వర్య రాజేష్‌)లు భార్య భర్తలు.

గౌతమ్‌, యామినిల ప్రేమ కథలో ఇజబెల్‌ మరియు శీనయ్య, సువర్ణ జీవితంలోకి స్మిత(కేథరిన్‌)లు వస్తారు.వారి రాకతో జరిగిన పరిణామాలు ఏంటీ? ఇంతకు గౌతమ్‌.శీనయ్యలకు సంబంధం ఏంటీ? ఈ రెండు పాత్రలు ఒక్కటేనా లేదంటే వేరు వేరా అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటు నటన : విజయ్‌ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అతడు ఈ చిత్రంలో మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించాడు.ఆ మూడు పాత్రలకు కూడా పూర్తి న్యాయం చేశాడు.

ముఖ్యంగా సింగరేణి గనిలో పని చేసే శీనయ్య పాత్రకు విజయ్‌ దేవరకొండ జీవం పోశాడు అని చెప్పుకోవచ్చు.రౌడీ స్టార్‌ తన అభిమానులకు ఫుల్‌ మీల్స్‌లా ఈ చిత్రంను ఇచ్చాడు.

పాత్ర కోసం అతడు మారిన విధానం నిజంగా చాలా గొప్ప విషయం.ఇక హీరోయిన్స్‌ విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్‌, రాశి ఖన్నాలకు నటించే అవకాశం దక్కింది.

వారు తమ పాత్రకు పూర్తి న్యాయం చేసే విధంగా నటించారు.మిగిలిన వారు తక్కువ స్కోప్‌ను కలిగి ఉన్నారు.అయినా కూడా ఉన్నంతలో కేథరిన్‌, ఇజబెల్లాలు తమ నటనతో ఆకట్టుకున్నారు.ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.


టెక్నికల్‌ : సినిమాలోని పాటలు సో సోగానే ఉన్నాయి.గోపీసుందర్‌ పాటలతో ఆకట్టుకోలేక పోయాడు.కాని బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది.పలు సీన్స్‌ను ఎలివేట్‌ చేసే విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను గోపీసుందర్‌ అందించాడు.

సినిమాటోగ్రఫీ బాగుంది.ముఖ్యంగా ఫారిన్‌లో మరియు సింగరేణిలో ఉండే సీన్స్‌కు జీవం పోసినట్లుగా సినిమాటోగ్రఫీ ఉంది.

ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.దర్శకుడు క్రాంతి మాధవ్‌ కథను చెప్పేందుకు ఎంపిక చేసుకున్న స్క్రీన్‌ప్లే కాస్త గందరగోళంగా అనిపించింది.దర్శకత్వం ఏమాత్రం బాగాలేదు.

విశ్లేషణ : సినిమాలో కీలకంగా చెప్పుకోవాల్సింది గౌతమ్‌, యామినిల ప్రేమ కథ మరియు శీనయ్య సువర్ణల వైవాహిక జీవితం.ఈ రెండు చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు.

కాని మద్యలో వచ్చే కొన్ని సీన్స్‌ వల్ల ఎక్కువ ప్ల్యాష్‌ బ్యాక్‌ సీన్స్‌ వల్ల సినిమా కథనం దెబ్బ తిన్నది.దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ను చాలా తిప్పి తిప్పి చెప్పడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపించడంతో ప్రేక్షకులు మ్యాజిక్‌ ఫీల్‌ అవ్వరు.

విజయ్‌ దేవరకొండను బాగానే వాడుకున్న దర్శకుడు కథను ఎంచుకున్న స్క్రీన్‌ప్లేను ఇంకాస్త బెటర్‌గా రూపొందించుకుంటే బాగుండేది.

ప్లస్‌ పాయింట్స్‌ : విజయ్‌ దేవరకొండ,
ఐశ్వర్య రాజేష్‌,
రాశిఖన్నా,
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ : స్లో కథనం,
కన్ఫ్యూజ్‌ స్క్రీన్‌ప్లే,
కథ, స్క్రీన్‌ప్లే

బోటమ్‌ లైన్‌ : కథనం సరిగా లేక విసిగించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

రేటింగ్‌ : 2.25/5.0

తాజా వార్తలు