వరల్డ్ ఫేమస్ లవర్ క్లోజింగ్ బిజినెస్.. పాపం బయ్యర్లు!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాతో విజయ్ మరోసారి ‘అర్జున్ రెడ్డి’ ఫీవర్ తెప్పిస్తాడని అందరూ అనుకున్నారు.

 World Famous Lover Closing Business-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది.

సినిమాలో ఆకట్టునే అంశాలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.ప్రేమికుల రోజున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా చాలా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది.ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ.30.50 కోట్లు కాగా, టోటల్ రన్‌లో ఈ సినిమా కేవలం రూ.10.15 కోట్లు మాత్రమే రాబట్టింది.

దీంతో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.

బయ్యర్లు ఈ సినిమాతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ త్రేసా, ఇసాబెల్ హీరోయిన్లుగా నటించగా క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేశాడు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3.85 కోట్లు

సీడెడ్ – 0.90 కోట్లు

నెల్లూరు – 0.31 కోట్లు

కృష్ణా – 0.51 కోట్లు

గుంటూరు – 0.74 కోట్లు

వైజాగ్ – 0.81 కోట్లు

ఈస్ట్ – 0.59 కోట్లు

వెస్ట్ – 0.44 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 8.15 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.00 కోట్లు

ఓవర్సీస్ – 1.00 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 10.15 కోట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube