వరల్డ్ ఫేమస్ లవర్ 7 రోజుల కలెక్షన్స్.. డిజాస్టర్‌ పక్కా!  

World Famous Lover 7 Days Collections - Telugu Aishwarya Rajesh, Lover, Raashi Khanna, Telugu Movie News, Vijay Devarakonda, World Famous

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ మంచి అంచనాల మధ్య ప్రేమికుల రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి అర్జున్ రెడ్డి ఫీవర్‌ను క్రియేట్ చేస్తాడని దేవరకొండ ఫ్యాన్స్ ఆశించారు.

World Famous Lover 7 Days Collections - Telugu Aishwarya Rajesh Raashi Khanna Movie News Vijay Devarakonda

క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ యూత్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.కానీ మిగతా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించలేదు.

దీంతో ఈ సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.కాగా కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా చాలా దారుణమైన వసూళ్లు సాధించింది.ఈ సినిమా మొదటి వారం ముగిసే సరికి చాలా తక్కవ వసూళ్లను కొల్లగొట్టి డిజాస్టర్ దిశగా వెళుతోంది.ఈ వారం భీష్మ చిత్రం రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో, వరల్డ్ ఫేమస్ లవర్‌ను చాలా థియేటర్ల నుండి తీసేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మొదటి వారం ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ.8.02 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ త్రేసా, ఇసాబెల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై వల్లభ ప్రొడ్యూస్ చేశారు.

ఇక ఈ సినిమా 7 రోజుల కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.03 కోట్లు

సీడెడ్ – 0.72 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.84 కోట్లు

ఈస్ట్ – 0.53 కోట్లు

వెస్ట్ – 0.41 కోట్లు

గుంటూరు – 0.70 కోట్లు

కృష్ణా – 0.49 కోట్లు

నెల్లూరు – 0.30 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 8.02 కోట్లు

తాజా వార్తలు