వరల్డ్ ఫేమస్ లవర్ 4 రోజుల కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

World Famous Lover 4 Days Collections - Telugu Catherine Tresa, Collections, Raashi Khanna, Vijay Devarakonda, World Famous Lover

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.ఈ సినిమాలో దేవరకొండ ఏకంగా నలుగురు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండటంతో యూత్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

World Famous Lover 4 Days Collections - Telugu Catherine Tresa, Collections, Raashi Khanna, Vijay Devarakonda, World Famous Lover-Movie-Telugu Tollywood Photo Image

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా రిలీజ్‌ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాను చూసేందుకు యూత్ తప్ప మిగతావారు ఆసక్తి చూపించలేదు.దీంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.ఈ సినిమా రిలీజ్ అయిన 4 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.7.78 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.ఇక ఈ శుక్రవారం నితిన్ నటించిన భీష్మ చిత్రానికి పాజిటివ్ బజ్ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ త్రేసా, ఇసాబెల్ హీరోయిన్లుగా నటించగా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 4 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3.93 కోట్లు

సీడెడ్ – 0.70 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.84 కోట్లు

ఈస్ట్ – 0.52 కోట్లు

వెస్ట్ – 0.40 కోట్లు

గుంటూరు – 0.67 కోట్లు

కృష్ణా – 0.44 కోట్లు

నెల్లూరు – 0.28 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 7.78 కోట్లు

తాజా వార్తలు

World Famous Lover 4 Days Collections-collections,raashi Khanna,vijay Devarakonda,world Famous Lover Related....