మరో 50 రోజుల్లో క్రికెట్ ప్రపంచం కప్ సమరం..భారత జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూడండి..  

World Cup Starts In 50 Days-dhoni,england,indian Cricketers,ipl,kohli,one Day Series,sports Updates,starts,t20,world Cup

క్రికెట్ ప్రపంచ కప్ సమరానికి దాదాపు మరో 50 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ప్రపంచ కప్ పైన భారత్ కి మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లతో బిజీ గా ఉన్న భారత క్రికెటర్లు ప్రపంచ కప్ ముందు కాస్త విశ్రాంతి కోరుకుంటున్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్ మే 12 న ఉండబోతుంది. దీనితో భారత ఆటగాళ్లకు ప్రపంచ కప్ ముందు 3 వారాల సమయం దొరుకుతుంది..

మరో 50 రోజుల్లో క్రికెట్ ప్రపంచం కప్ సమరం..భారత జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూడండి..-World Cup Starts In 50 Days

ప్రస్తుతం ప్రపంచ కప్ కి భారత్ సన్నాహాలు ఎలా ఉన్నాయిభారత్ ప్రపంచ కప్ కి ముందు కీలకంగా ఉంటుంది అనుకున్న ఆస్ట్రేలియా తో సిరీస్ ని భారత జట్టు 2-0 తో ఉండి 2-3 తో ఓటమిపాలైంది. ఇకపోతే భారత జట్టు కి బలమైన మిడిల్ ఆర్డర్ అవసరం ఉంది.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ , ఎం.ఎస్ ధోని లని మినహాయిస్తే నిలకడైన బ్యాట్స్ మెన్ లు భారత జట్టుకు లేకపోవడం భారత అభిమానులని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఆడుతున్న ఐపీఎల్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ లు చెప్పుకోదగ్గ పరుగులు చేయకపోవడం దానికి తోడు ముంబై తరుపున ఆడుతున్న రోహిత్ శర్మ కి మ్యాచ్ సమయం లో తీవ్ర గాయం కావడం జట్టు మేనేజ్మెంట్ ని ఇబ్బందిపెడుతుంది.

ఆ స్థానం లో ఇంకెవరో , ప్రత్యామ్నాయలు వీరే.జట్టుకు కీలకమైన బ్యాటింగ్ స్తానం నంబర్ 4 , గతేడాది నుండి ఈ స్థానం కోసం చాలా బ్యాట్స్ మెన్ లని ప్రయత్నించారు. కానీ ఎవరూ చెప్పుకోదగ్గట్టుగా రాణించలేకపోయారు. ఏ జట్టుకైనా నంబర్ 4 స్థానం లో మంచి నిలకడైన బ్యాట్స్ మెన్ అవసరం ఉంటుంది. ఈ స్థానం లో గత కొద్ది కాలం గా అందరి కన్నా ఎక్కువ ఆకట్టుకున్న ఆటగాడు అంబటి రాయుడు.

అతను బాగానే అడుతున్నప్పటికీ కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్థానం కోసం రాయుడితో పాటు రాహుల్ , విజయ్ శంకర్ , రిషబ్ పంత్ లు పోటీ లో ఉన్నారు..

భారత జట్టు కి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి.2019 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో జరగనుంది. అక్కడి పరిస్థితులు భారత్ ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే భారత జట్టు గతేడాది అక్కడ టీ 20 , టెస్ట్ లతో పాటు వన్డే సిరీస్ కూడా ఆడింది. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ మరియు ధోని లకి అక్కడ మంచి రికార్డ్ లు ఉన్నాయి. గతేడాది కాలంగా ఇంగ్లాండ్ తో పాటు ప్రపంచ కప్ గెలిచే జట్టు ఏది అంటే భారత్ పేరు గట్టిగా వినిపించింది.

ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు ఎందుకంటే సొంత గడ్డ పైన బలహీనమైన ఆసీస్ జట్టు తో టీ 20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ఓటమి మరియు భారత ఆటగాళ్ల ఫామ్ ఇబ్బంది పెడుతున్న అంశాలు. బౌలింగ్ లో షమీ , బుమ్ర , భువి లతో పాటు స్పిన్నర్లు చహల్ , కుల్దీప్ యాదవ్ లు ఇంగ్లాండ్ గడ్డ పైన సత్తా చాటినవారే. ఇకపోతే బ్యాటింగ్ లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ , ధావన్ లు ఫామ్ లోకి వస్తే ఇంగ్లాండ్ లో బలమైన జట్లకి గట్టి పోటీనివ్వనుంది భారత జట్టు. ఈ సారి వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ లు అయిన ఇంగ్లాండ్ జట్టు కి భారత జట్టు కి తేడా ఒకటే ఆ జట్టుకు బ్యాటింగ్ తో పాటు మంచి బౌలింగ్ చేసే అల్రౌండర్లు ఉండడం..

ప్రపంచం లొనే ఏ జట్టుకు లేని విధంగా భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్ ఇంగ్లాండ్ జట్టు సొంతం. ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా , న్యూజిలాండ్ జట్లు కూడా వరల్డ్ కప్ ఫేవరెట్ లలో ఉండబోతున్నాయి. ఇంగ్లాండ్ పిచ్ ల పైన మన ఆటగాళ్లు ఏవిధంగా బ్యాటింగ్ చేస్తారో దాని పైనే మన వరల్డ్ కప్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.