హీట్ పెంచుతున్న ప్రపంచ కప్... సారధులు ఫోటోషూట్  

Started World Cup Fever...captains Photoshoot-ms Dhoni,world Cup,world Cup 2019,ప్రపంచ కప్

ఈ నెల 30 నుంచి ప్రపంచ కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటివరకు ఎన్నికలపై పెరిగిన హీట్ కు తెరపడడం తో ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా కూడా ప్రపంచకప్ పైనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. అయితే ఈ ప్రపంచకప్ దగ్గర పడుతున్న సమయంలో పాకిస్థాన్ లో ధోనీ వీరాభిమాని షెజాద్ ఆల్ హాసన్ పాక్ జెర్సీ పై ధోనీ పేరు,నంబర్ 7 ను ముద్రించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీనిని అతడు ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం ఠీ ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అయ్యింది..

హీట్ పెంచుతున్న ప్రపంచ కప్... సారధులు ఫోటోషూట్ -Started World Cup Fever...Captains Photoshoot

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో పాక్ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కూడా ధోనీ పై నేరుగా ప్రసంశల వర్షం కురిపించారు.

అయితే తరచూ సరిహద్దుల్లో ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత్,పాక్ ల మధ్య మ్యాచ్ లు అనేవి ఇటీవల జరగడం లేదు. అయితే ఈ ప్రపంచ కప్ లో భాగంగా ప్రత్యర్థి దేశం అయిన పాక్ జట్టు తో ఈ నెల 16 న భారత జట్టు తలపడనుంది. తొలుత ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో తలపడకూడదు భావించినప్పటికీ చివరికి ఈ మ్యాచ్ ఆడాలనే భారత్ నిర్ణయించింది.

ఈ మ్యాచ్ లో గెలిచి అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించాలని భారత్ భావిస్తుంది..

ఈ నేపథ్యంలో పాక్ తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. మరోపక్క ప్రపంచ కప్ లో పాల్గొనడం కోసం ఇప్పటికే భారత్ ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్‌కప్‌ రధసారథులు…ఆపై ఫొటోలకు పోజులిచ్చారు. పది జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఈ రోజు న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న భారత్ జూన్ 5 న సౌతాంష్టన్ వేదికగా సౌతాఫ్రికా తో ప్రపంచ కప్ లో తన తోలి మ్యాచ్ ఆడనుంది.