మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా? అని అడిగితె...ఆమె ఇచ్చిన ఆన్సర్ కి ఫిదా అవ్వాల్సిందే.!     2018-07-28   11:43:36  IST  Sai Mallula

ఆమెను ఒకరు అడిగారు మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా?
అని…..
హా …… నేను కేవలం హౌస్ వైఫే కాని 24గంటలు వర్క్ చేసే హౌస్ వైఫే
నేను ఒక అమ్మ
నేను ఒక భార్య
నేను ఒక కుమార్తె
నేను ఒక కోడలు
నేను ఒక అలరాం గడియారం
నేను ఒక వంటామె
నేను ఒక అంట్లుతోమె పనిమనిషి ని
నేను ఒక టీచర్
నేను ఒక అకౌంటెంట్
నేను ఒక గుమాస్తా
నేను ఒక వడ్దించే వేటర్
నేను ఒక ఆయా
నేను ఒక నర్సు
నేను ఒక గార్డనర్
నేను ఒక గూర్ఖ
నేను ఒక కౌన్సిలర్
నేను నా భర్తకి శయనభాగస్వామి

Working Wife OR House Wife? Women Gives Supeer Answer-

Working Wife OR House Wife? Women Gives Supeer Answer

అయినా చూడండి నాకు సి. యల్. లేదు, ఈ. యల్ లేదు సండెలేదు, పండుగ , అంతేకాదు నాకు జీతంలేదు.

కాని ఎందుకో అందరూ అడుగుతారు ఇంట్లో కూర్చొని ఎం చేస్తావని?

ఫలానా ఆవిడ ఇలా పనిచేస్తుంది, ఫలానా ఆవిడా అక్కడ ఉద్యోగం చేస్తుంది, ఫలానా ఆవిడ వ్యాపారం చేస్తుంది అని.

మీరు కాళీగా ఉండే బదులు అలా పని చేయొచ్చు కదా అని.

దయచేసి ఒకరిని మరొకరితో పోల్చకండి.
అందరి ఆడవారి పరిస్థితులు ఒకేలా ఉండవు.
వాషింగ్ మెషిన్,మిక్సీలు వచ్చాక కూడా ఇంకేమి పని ఉంటుంది అంటారేమో ….!

మీ ఇంటి ఇల్లాలిని ఒక్క నెల రోజులు పుట్టింటింకి పంపించి అదే వస్తువులతో మీ ఇల్లాలి పని ఒక్కసారి మీరు చేసి చూడండి.

మీ వంటగది చెప్తుంది మీ అమ్మ(గృహిణి) చేతి పని మీ పూజ గది చెప్తుంది మీ ఇల్లాలి చేతి పవిత్రత మీ బాత్రూం, మీ వాకిలి చెప్తుంది హౌస్ వైఫ్ వ్యాల్యూ ఏమిటో మేము చేసే పనికి జీతాలు,సన్మానాలు,సత్కారాలు మేం కోరుకోవటం లేదు.

మా పనిని గుర్తించక పోయినా పర్లేదు,కాని తక్కువ చేసి మాత్రం చూడొద్దు.

గుర్తుంచుకోండి:

ఒక గృహిణి ఇంటి పని నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ పనైనా చేయగలదు కానీ ఒక గృహిణి పని ఎవరు చేయలేరు