నాటో ప్లస్‌ లో భారత్‌ను ఆరో దేశంగా చేర్చుతాం : ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా

‘నాటో ప్లస్లో భారత్‌ను ఆరో దేశంగా చేర్చేందుకు కృషి చేస్తానన్నారు భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… రక్షణ ఒప్పందాలకు సంబంధించి నాటో మిత్రదేశాలు త్వరగా ఆమోదం పొందుతాయని అన్నారు.

 Working To Add India As The Sixth Country To Nato Plus Says Indian American Lawm-TeluguStop.com

ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాలు అదే ఒప్పందాన్ని కలిగి వున్నాయని రో ఖన్నా గుర్తుచేశారు.తదుపరి కాంగ్రెస్ సమావేశాలలో దీనికి సంబంధించిన పని నెరవేరుస్తానని ఆయన అన్నారు.

భారత్- అమెరికా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి వీలుగా రో ఖన్నా ప్రతిపాదించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డీఏఏ)కు జూలై 14న యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.పౌర అణు ఒప్పందం తర్వాత ఇండో యూఎస్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది అత్యంత కీలకమైనదని ఖన్నా వ్యాఖ్యానించారు.

భారతదేశంతో బలమైన భాగస్వామ్యం అవసరమని.రక్షణ భాగస్వామ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2008లో భారత్ – అమెరికా మధ్య అణు సహకార ఒప్పందంపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే.ఇది రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తొలి అడుగుగా నిపుణులు అభివర్ణిస్తారు.

ఈ అణు ఒప్పందంలో ప్రధాన అంశం ఏమిటంటే… న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్‌జీ) భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం.తద్వారా డజనకు పైగా దేశాలతో సహకార ఒప్పందాలపై సంతకం చేసేందుకు భారత్‌కు వీలు కల్పించింది.

ఇది పౌర, సైనిక కార్యక్రమాలను భారత్ వేరు చేయడానికి వెసులుబాటు కలిగించింది.దీని పౌర అణు సౌకర్యాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) రక్షణ కింద వుంచింది.

Telugu Australia, Iaea, Indianamerican, Israel, Japan, Nato, Zealand, Ro Khanna,

ఇక భారత్‌ను నాటో ప్లస్ దేశాల కూటమిలో చేర్చేందుకు గాను వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు రో ఖన్నా.కాస్త ఆలస్యంగానైనా రెండు ప్రజాస్వామ్య దేశాలు రక్షణ సహకారంలో గణనీయమైన పురోగతిని సాధించాయని ఆయన చెప్పారు.భారత్‌లోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తల నుంచి ప్రతిభను అందుకోవడం పట్ల అమెరికాకు ఆసక్తి వుందని.తద్వారా తాము అత్యున్నత సాంకేతికతకు నాయకత్వం వహించడాన్ని కొనసాగించగలమని రో ఖన్నా అన్నారు.

యూఎస్ ఇండియా కూటమి అమెరికా ప్రయోజనాలకు మాత్రమే కాకుండా.భారతదేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.భారత్ కు అమెరికా విశ్వసనీయ, బలమైన భాగస్వామి అని రో ఖన్నా పేర్కొన్నారు.ఇకపోతే… రష్యా నుంచి ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు ప్రతిబంధకంగా మారిన అమెరికా కాట్సా చట్టం ఆంక్షల కత్తి నుంచి భారత్ ను రక్షించేందుకు యత్నాలు మొదలైన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఇందుకు చొరవ తీసుకున్నారు.దీనికి సంబంధించి కొద్దిరోజుల క్రితం ఆయన ప్రవేశపెట్టిన చట్ట సవరణకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube