ప్రతిష్ఠ ఇండస్ట్రీస్ కార్మికులు ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

Workers Of Pratishtha Industries Stage Dharna In Front Of RDO Office

యాదాద్రి జిల్లా:దసరా పండుగ సందర్భంగా పెండింగ్ బోనస్,జీతం ఇవ్వాలని,ప్రతిష్ఠ యాజమాన్యం మొండి వైఖరి నశించాలని,కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలోని ప్రతిష్ఠ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్మికులు ప్రతిష్ఠ స్టాప్ మరియు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

 Workers Of Pratishtha Industries Stage Dharna In Front Of Rdo Office-TeluguStop.com

నూతన వేతన ఒప్పందం కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నా కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో 13వ రోజు ఎస్.లింగోటం నుండి చౌటుప్పల్ ఆర్డీవో ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశం,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ముఖ్యాతిథులుగా హాజరై సంఘీభావం తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ గత 11 నెలలుగా కార్మికులకు వేతన ఒప్పందం చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న ప్రతిష్ఠ యాజమాన్యం కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల కార్మిక ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.12 రోజుల సమ్మె వల్ల 68 కోట్ల మేరకు నష్ఠం వచ్చిందని లే-ఆఫ్ చేస్తున్నామని ప్రకటించడం చట్ట విరుద్ధమన్నారు.తక్షణమే లే-ఆఫ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తున్న యాజమాన్యం,సంవత్సరానికి కార్మికుల సంక్షేమం కోసం కేవలం 60 లక్షల రూపాయలు భరించలేదా అని ప్రశ్నించారు.

సమాజం మొత్తం ప్రతిష్ఠ యాజమాన్యం మొండి వైఖరిని ఖండిస్తుందని, కార్మికుల సమ్మె పోరాటానికి రోజు రోజుకు మద్దత్తు పెరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠ స్టాప్ మరియు వర్కర్స్ యూనియన్ (సిఐటియు)అద్యక్ష,కార్యదర్శులు ఎండి పాషా, యూనియన్ నాయకులు దూసరి వెంకటేశం,సత్యం, పల్సం వెంకటేశం,సత్యనారాయణ,బుచ్చమ్మ,లలిత, పార్వతమ్మ,రవిందర్ రెడ్డి,సతీష్,లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube