ఇదేందయ్యా ఇది: కరోనా కోసం లాక్ డౌన్ విధిస్తే... వాళ్ళు దాన్ని బాగా ఉపయోగించుకున్నారట...

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించి నివారణ చర్యలు చేపట్టారు.

 Work From Home, Lock Down Time, Corona Virus, Lock Down Survey-TeluguStop.com

అయితే ఈ లాక్ డౌన్ లో భాగంగా  దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటూ  ప్రైవేటు సంస్థలు కూడా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించారు.దీంతో ఉద్యోగులు తమ ఇళ్లకే పరిమితమై కుటుంబంతో హాయిగా గడుపుతూ పనులు చేసుకుంటున్నారు.

దీంతో తాజాగా ఓ ప్రముఖ సర్వే సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు వ్యక్తిగత వైవాహిక జీవితం గురించి ఒక సర్వే నిర్వహించింది.ఇందులో ఎక్కువ మంది ఎలాంటి పని ఒత్తిడి మరియు ఆర్థిక ఒత్తిడి లేకపోవడంతో శృంగారంలో సంతృప్తికరంగా పాల్గొన్నట్లు సర్వే ద్వారా కనుగొన్నారు.

మరికొంత మంది కూడా పని ఒత్తిడిలో పడడం, డబ్బు సంపాదన నిమిత్తమై ఇతర ప్రదేశాల్లో నివసించడం వంటి అంశాల కారణంగా  గతంలో తమ కుటుంబానికి దూరమయ్యి జీవితంలో ఏం కోల్పోయామో లాక్ డౌన్ సమయంలో తెలుసుకున్నామని, కాబట్టి ఇంట్లో ఉండి పని చేసే అవకాశం ఉన్నటువంటి సంస్థలో ఉద్యోగాల నిమిత్తమై దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తమ ఇళ్లల్లో పనిచేసే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారట.

అయితే కరోనా కారణంగా మానవాళికి ప్రాణ ముప్పు ఏర్పడినప్పటికీ ప్రకృతికి మాత్రం చాలా మేలు జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా పట్టణాలు, ఫ్యాక్టరీలు, తదితర వాటిల్లో నుంచి వెలువడే పొగ, దుమ్ము కాలుష్యం వంటి వాటి కారణంగా ఓజోన్ పొర దెబ్బతిందని  కానీ ఈ లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ ఓజోన్ పొర పరిస్థితి కూడా బాగానే మెరుగుపడిందని అంటున్నారు.అంతేగాక మానవుల జీవిత శైలిలో కూడా మార్పులు వచ్చాయని అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube