భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి అద్భుతాలు చేయనున్నాయి     2017-01-08   00:11:59  IST  Raghu V

ఓ పదహేను ఏళ్ళు వెనక్కి వెళితే ఒక మొబైల్ ఫోన్ తో ఫోటోలు, వీడియోలు తీయవచ్చు అని ఊహించామా ? ఫోన్ ద్వారా షాపింగ్, బిల్ పేమెంట్స్ చేస్తామని ఊహించామా ? అసలు కంప్యూటర్ ని తలదన్నే స్మార్ట్ ఫోన్స్ వస్తాయని కలలో అయినా అనుకున్నామా? కాని అన్ని జరిగాయి. ఇప్పుడు ఊహించకోండి భవిష్యత్తులో మొబైల్ ఇంకెలాంటి అద్భుతాలు చేయబోతోందో! మీ ఊహలు మీరు ఊహించుకోండి కాని, ముందు టెక్ నిపుణులు అంచనాలు ఏంటో చూడండి.

* ఇప్పుడు స్మార్ట్ ఫోన్ డిస్ప్లే బ్రైట్ గా, క్లియర్ గా, కలర్ ఫుల్ గా బాగంది. మరి ఇదే డిస్ప్లే 3D లో ఉంటే? ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ! ఆపిల్ కంపెనీ దగ్గర ఈ ఆలోచన ఉందట.

* స్మార్ట్ ఫోన్ కిందపడితే పగిలిపోవచ్చు. మనం బలప్రయోగం చేసినా, నష్టం కలగవచ్చు. కాని జేబులో మడిచి పెట్టుకునే స్మార్ట్ ఫోన్ వస్తే? ఎటువైపు అయినా సరే, వంచితే వంగే మొబైల్ ఉంటే? కిందపడితే నష్టం వాటిల్లే అవకాశం కూడా చాలా అంటే చాలా తక్కువే. ఇలాంటి మొబైల్ మీద షియోమి సంస్థ కసరత్తు చేస్తోంది.

* పోకిమాన్ గో మొబైల్ ఎప్పుడైనా ఆడారా ? ఆ గేమ్ లో జిపిఎస్ ద్వారా మీ కెమెరాలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్ని కనబడతాయి. మీరు తిరుగుతూ పోకిమాన్స్ ని పట్టుకోవాలి. ప్రస్తుతం ఇదే గేమ్ ని ఆధారం చేసుకోని, మొబైల్ కెమేరా ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, థియేటర్స్, రోడ్లు, ఇలా సిటి మ్యాప్ మొత్తం కెమెరాలో కనబడే వెసులుబాటు రానున్న స్మార్ట్ ఫోన్స్ కల్పించనున్నాయట.

* త్వరలోనే స్మార్ట్ ఫోన్ ప్రొజెక్టర్ లాగా కూడా పనిచేయనుంది. అంటే గోడలపై పెద్ద ఆకారంలో ప్రోజెక్టు చేసుకోని సినిమాలు చూడవచ్చు అన్నమాట.

* మొబైల్ అసిస్టెంట్స్ ఇంకా మెరుగ్గా పనిచేయనున్నాయి. మన భాషను మరింత జాగ్రత్తగా విని అర్థం చేసుకోనున్నాయి.