ఈ ఐదు సూత్రాలు పాటిస్తే.. మీ ఆరోగ్యం ప‌దిలం!  

ఆరోగ్యమే మహా భాగ్యం.ఎంత సంప‌ద ఉన్నా ఆరోగ్యంగా లేక‌పోక‌పోతే.ఉన్నదంతా బూడిద‌లో ప‌న్నీరుతోనే స‌మానం.ఈ విష‌యం అంద‌రికీ తెలిసు.అయిన‌ప్ప‌టికీ.కొంద‌రు మాత్రమే ఆరోగ్యంపై శ్ర‌ద్ధ తీసుకుంటారు.

TeluguStop.com - Wonderful Tips To Maintain Good Health

మ‌రి కొంద‌రు ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లుపు త‌ట్టాక‌.జాగ్ర‌త్త‌లు పాటిస్తారు.

కానీ, అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే.ముందు నుంచి స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

TeluguStop.com - ఈ ఐదు సూత్రాలు పాటిస్తే.. మీ ఆరోగ్యం ప‌దిలం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా ఇప్పుడు ఐదు సూత్రాల‌ను పాటిస్తే.ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చిని అంటున్నారు.మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

నిద్ర‌:

మాన‌వుడికి నిద్ర ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.నిద్ర లేక‌పోతే మ‌నిషి లేడు అన‌డంలో సందేహం లేదు.కానీ, నేటి ఆధునిక కాలంలో దాదాపు అర‌వై శాతం మంది నిద్ర‌ను నెగ్లెట్‌ చేస్తున్నారు.

వాస్త‌వానికి తొబై శాతానికి పైగా జ‌బ్బుల‌ను దూరం చేసేది నిద్రే.కాబ‌ట్టి, రోజుకు క‌చ్చితం ఎనిమిది గంట‌లు నిద్రించాలి.

జంక్ ఫుడ్‌:

ఆరోగ్యానికి ఎంత హానీ చేస్తుందో తెలిసి కూడా పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్స్‌ తింటారు కొంద‌రు.కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల త‌ప్పా.శ‌రీరానికి కావాల్సి ఎలాంటి పోష‌కాలు ఈ జంక్ ఫుడ్‌లో ల‌భించ‌వు.పైగా జంక్ ఫుడ్ తిన‌డం వ‌ల్ల డయాబెటిస్, హైబీపీ, గుండె జ‌బ్బులు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు వెంటాడుతాయి.

సో.స్టాప్ జంక్ ఫుడ్.

వ్యాయామం:

ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు.జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా.ఉన్న జ‌బ్బులు పోవాల‌న్నా వ్యాయాయం త‌ప్ప‌ని స‌రి.కాబ‌ట్టి, ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ప‌దిహేను నిమిషాలు అయిన వ్యాయామం చేయాలి.అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

స్మోకింగ్‌:

ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం మ‌రియు క్యాన్సర్ కు కారకం అని చ‌దువుతారు త‌ప్పా.పాటించ‌రు.ఇటీవ‌ల కాలంలో కొంద‌రు ఫ్యాషన్ పేరుతో కూడా స్మోకింగ్ చేస్తున్నారు.

కానీ, చివ‌ర‌కు స్మోకింగే జీవితాన్ని కిల్ చేసేస్తుంది.స్మోకింగే కాదు మ‌ద్య‌పాణం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.కాబ‌ట్టి, రెండిటికీ దూరంగా ఉండాలి.

గుడ్ ఫుడ్‌:

ఆహారం విష‌యం వ‌స్తే.ప్ర‌తి రోజు మ‌న శ‌రీరానికి కావాల్సిన అన్ని పోష‌కాలు అందేలా చూసుకోవాలి.ముఖ్యంగా ఒక గ్లాస్ పాలు, ఉడికించిన గుడ్డు, న‌ట్స్‌, తాజా పండ్లు, తృణ‌ధాన్యాలు ఇలా ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆహార‌న్ని డైట్‌లో చేర్చుకోవాలి.

అదే స‌మ‌యంలో కేల‌రీలు త‌క్కువ‌గా ఉండే ఫుడ్ తీసుకుంటే.బ‌రువు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

#Good Food #Good Health #Health #Health Tips #Wonderful Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు