గులాబీ రేకులు తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌..తెలుసా?

గులాబీ పూలు . వీటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Wonderful Health Benefits Of Rose Petals-TeluguStop.com

గులాబీ పూలు చూసేందుకు ఎంత ముద్దుగా, అందంగా ఉంటాయో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది.ఇక గులాబీ పూల‌ను అల‌క‌ర‌ణ‌కు మ‌రియు చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.

అయితే ఆరోగ్యానికి కూడా గులాబీ పూలు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అందుకే కొంద‌రు గులాబీ రేకుల‌ను తింటుంటారు.

 Wonderful Health Benefits Of Rose Petals-గులాబీ రేకులు తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌..తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గులాబీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ముఖ్య ప్ర‌యోజ‌నాల్లో వెయిట్ లాస్ ముందుంటుంది.

అవును, అధిక బ‌రువును నివారించ‌డంలో గులాబీ పూలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అయితే గులాబీ రేకుల‌ను డైరెక్ట్‌గా తీసుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే.మ‌రి ఎలా తీసుకుంటే మంచిది అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని ఫ్రెష్ గులాబీ రేకుల‌ను తీసుకుని లైట్‌గా క్ర‌స్ చేసి.వాట‌ర్‌లో వేసి బాగా మ‌రిగించాలి.

ఇలా మ‌రిగించిన వాట‌ర్‌ను వాడ‌బోసి.స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లిపి తీసుకోవాలి.

ఇలా డ్రింక్‌ను ప్ర‌తి రోజు ఒక క‌ప్పు చ‌ప్పున తీసుకుంటే.శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతాయి.అలాగే గులాబీ రేకుల‌తో త‌యారు చేసిన డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో గులాబీ రేకులు, ఎండు ద్రాక్ష‌, సోపు గింజులు వేసి రాత్రంతా నాన బెట్టి ఉద‌యం వాడబోసి తీసుకోవాలి.

ఇలా తీసుకుంటే ర‌క్త హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌రియు గుండె ద‌డ‌, గుండెళ్లో మంట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే సంతాన లేమితో బాధ ప‌డే వారు రెగ్యుల‌ర్ ఈ డ్రింక్ తీసుకుంటే.

శృంగార సమస్యలు, సంతాన సమస్యలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.గులాబీ రేకుల‌ను స‌లాడ్స్ లేదా ఇతర ఆహార పదార్థాలతో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు.

ఎలా తీసుకున్నా ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

#Rose Petals #BenefitsRose #Rose #Tips #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు